Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు..

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్‌ వేసిన స్కెచ్‌ను చాకచక్యంగా చేధించారు. విజయనగరం టూ హైదరాబాద్‌కు చేపట్టిన ఆపరేషన్‌ బ్లాస్ట్‌ను పోలీసులు భగ్నం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అటు.. హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర బట్టబయలు కావడంతో..

Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు..
Charminar

Updated on: May 19, 2025 | 8:39 AM

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్‌ వేసిన స్కెచ్‌ను చాకచక్యంగా చేధించారు. విజయనగరం టూ హైదరాబాద్‌కు చేపట్టిన ఆపరేషన్‌ బ్లాస్ట్‌ను పోలీసులు భగ్నం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అటు.. హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర బట్టబయలు కావడంతో విజయనగరం ఉలిక్కిపడింది. కుట్రకు ప్లాన్‌ చేసిన సిరాజ్‌.. విజయనగరంలో అరెస్ట్‌ అవడంతో షేక్‌ అయింది. విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. సమీర్‌ను హైదరాబాద్‌ నుంచి విజయనగరం తరలించారు. కోర్టు అనుమతితో ఇద్దర్నీ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు.

దేశంలో ఎక్కడ ఉగ్రనీడలు బయటపడినా.. దాని లింకులు హైదరాబాద్‌లో కనెక్ట్‌ అవుతుండడంతో టెర్రర్‌ ఇండికేషన్స్‌పై కొన్నాళ్లుగా ఇంటెలిజెన్స్‌ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. నిందితుడు సిరాజ్‌పై ఆర్నెల్లుగా డేగ కన్నేసింది. సిరాజ్‌కు.. సమీర్‌కు పేలుళ్లపై ఐసిస్ ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో ముందుగా డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్‌ చేశారు. దానిలో భాగంగానే.. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్.. సోషల్‌ మీడియా ద్వారా బాంబుల తయారీకి పూనుకున్నాడు. దీనిపై.. పక్కా సమాచారం అందుకున్న ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో పేలుళ్ల కుట్రకు చెక్‌ పెట్టారు. సిరాజ్‌ నుంచి అమ్మోనియా, సల్ఫర్‌, అల్యూమినియం లాంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక.. హైదరాబాద్‌లోని పలు చోట్ల బ్లాస్టింగ్‌కు సౌదీ అరేబియా నుంచి ఐసిస్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతైన దర్యాప్తుతో ఇద్దరు నిందితుల నుంచి మరింత కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు.