ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. ప్రధాన రాజకీయ పార్టీలో ఆశావహులు – అభ్యర్థుల హడావిడి మొదలైంది.. ఇప్పటికే ప్రధాన నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు నేతలు కసరత్తు ముమ్మరం చేశారు..కానీ కొండా దంపతుల దారేటు..? ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడంలేదు.. నాయకులు, కార్యకర్తలు, వారి అనుచరులకు కూడా కొండా దంపతుల దారేదనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. వరంగల్ తూర్పు నుండి తాము పోటీ చేస్తామని కొద్ది రోజుల క్రితం కొండా దంపతులు ప్రకటన చేశారు.. కానీ తాజాగా పరకాల నియోజక వర్గంలో కొండా మురళి చేసిన హడావుడి చూస్తే ఆయన పరకాల నుండి బరిలోకి దిగుతారా..! అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వరంగల్ తూర్పు నుండి తాము పోటీ చేస్తామని ప్రకటన చేశారు తప్ప కార్యక్రమాల్లో జోష్ లేదు.. అడపాదడపా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.. అంత యాక్టివ్ రోల్ పోషించక పోవడం పట్ల ఇక్కడ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. అదే క్రమంలో కొండా మురళి శుక్రవారం అగ్రం పహాడ్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో హడావుడి చేశారు.
కొండా మురళి మీటింగ్ ప్రాంతానికి చేరుకొని తన బల నిరూపణ చేసుకున్నారు.. అక్కడికి చేరుకోగానే ఆయన వర్గీయులు నినాదాలు చేశారు.. భారీ ర్యాలీ నిర్వహించారు.. కొండా మురళి సభ వేదిక పైన మాట్లాడుతున్న క్రమంలో కూడా ఆయన స్టార్టజీ అమలు చేశారు.. అనుచరుల హంగామా అంతా ఇంతా కాదు… ఈ క్రమంలో ఇప్పటికే పరకాల ఇన్చార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇనుగాల వెంకటరామిరెడ్డి vs కొండ మురళి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.
పరకాల నియోజకవర్గం లో కొండా మురళి చేసిన హడావుడి చూస్తే ఆయన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి బరిలోకి దిగుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కొండా అనుచరులు కూడా కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో పరకాల నుండే పోటీ చేస్తుందని భావిస్తున్నారు.. మరోవైపు తూర్పులో కూడా మరో కాలు వేశారు.. పరకాల నుండి పోటీ చేస్తారా..? వరంగల్ తూర్పు నుండి పోటీ చేస్తారా..? లేకపోతే రెండు చోట్ల టికెట్ తెచ్చుకొని భార్యా-భర్తలు, లేదంటే తల్లి – బిడ్డలు రంగంలోకి దిగుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికీ కొండా దంపతులు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.. మొదట వరంగల్ తూర్పు నుండి దిగుతామని ప్రకటించిన కొండ దంపతులు ఇప్పుడు పరకాల నియోజకవర్గంలో స్పీడ్ పెంచడం పట్ల ప్రజలలో అటు పార్టీ శ్రేణులు ఆసక్తికర చర్చ మొదలైంది.
ఇప్పటికే పరకాల టికెట్ పై ఆశలతో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న ఇనుగాల వెంకటరామిరెడ్డి మాత్రం వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు.. పరకాల టిక్కెట్ నాదే.. కచ్చితంగా బరిలో ఉంటానని ప్రకటన చేస్తున్నారు.. దీంతో పరకాల కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు భగ్గుమంటుంది.. ఈ పోరులో నెగ్గేదెవరో..? తగ్గేదెవరో.? పార్టీ శ్రేణులకు- ప్రజలకు అంత చిక్కడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..