రైల్వే మెయింటనెన్స్ కారణాల వల్ల మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే మరి కొన్ని రైళ్లను కూడా తాత్కాలికంగా..
Ad
మరోవైపు గర్భిణి ఉంటే ఆమెకు లోయర్ బెర్త్ కూడా ఇస్తారు. మీరు IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Follow us on
రైల్వే మెయింటనెన్స్ కారణాల వల్ల మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే 17 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే మరి కొన్ని రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేసింది. నిన్న(ఫిబ్రవరి 13) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నాన్-ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల ఫిబ్రవరి 14 నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 17 రైళ్లు రద్దయ్యాయి. మరో 7 రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసింది రైల్వే సంస్థ. సికింద్రాబాద్ డివిజన్‌లోని కాజీపేట-బల్హర్షా సెక్షన్‌లోని మకుడి-వీరూర్ స్టేషన్‌ల మధ్య 3వ లైన్ కనెక్టివిటీ ఏర్పాటుకు ఇంటర్‌లాక్ చేయని పనుల కారణంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.