Telangana: చేపల కోసం వేసిన వల బరువుగా అనిపించింది.. తీరా పైకి లాగి చూడగా

|

Nov 25, 2024 | 9:31 AM

వల బరువుగా అనిపిస్తే.. ఆహా దండిగా చేపలు పడ్డాయ్ అనుకున్నారు. ఆ వలను బలంగా బయటకు లాగారు. కట్ చేస్తే ఊహించని సీన్ వెలుగుచూసింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: చేపల కోసం వేసిన వల బరువుగా అనిపించింది.. తీరా పైకి లాగి చూడగా
Python
Follow us on

అప్పటి వరకు ఆ చెరువులో ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లు సరదాగా ఈత కొట్టేవారు. అంతే సరదాగా చేపలు కూడా పట్టేవారు. కానీ ఈరోజు చేపల కోసం వేసిన వల కాస్తా బరువుగా అనిపించింది. ఆదివారం తమ పంట పండిందనుకున్నారు. అందరూ కలిసి బలంగా వలను గుంజారు. కానీ అక్కడ జరిగింది చూసి షాక్‌ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది.

ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని చెరువు కట్ట వద్దకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను వేరు చేశారు. కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు.

ఎల్లమ్మ చెరువులో కొండచిలువ దొరకడంతో మత్స్యకారులతో పాటు, ప్రతి రోజు ఉదయం చెరువులో ఈత కొట్టే స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..