Droupadi Murmu: భద్రాచలానికి రాష్ట్రపతి.. ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రథమ పౌరురాలు..

భారతదేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 న భద్రాచలం రానున్నారు. రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాద్ పథకాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ మేరకు...

Droupadi Murmu: భద్రాచలానికి రాష్ట్రపతి.. ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రథమ పౌరురాలు..
Droupadi Murmu

Updated on: Dec 15, 2022 | 8:14 AM

భారతదేశ ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 న భద్రాచలం రానున్నారు. రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాద్ పథకాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో రాష్ట్రపతి బిజీగా గడపనున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆమె భద్రాచలం చేరుకుంటారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ మాడవీధి నుంచి వీఐపీ మార్గంలో వాహనాల రాకపోకలు ఇబ్బంది లేకుండా మెట్లను తొలగించాలని నిర్ణయించారు. అయితే.. 23 నుంచి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. 1965 జులై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గోదావరి వంతెన జాతికి అంకితమైంది. ఆ తర్వాత కాలంలో రాష్ట్రపతి రావడం ఇది రెండో సారి. శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.

ఈ నెల 28న ఉదయం 10.40 నుంచి 11.10 గంటల వరకు భద్రాచలం ఆలయాన్ని సందర్శించి.. రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రసాద్‌ ప్రాజెక్టును ఈ సందర్భంగా ఆమె ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు వరంగల్‌ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ సైతం ప్రశాద్‌ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖకి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం