Postal: పోస్టల్ శాఖ కీలక నిర్ణయం.. బుక్ చేసుకున్న తర్వాతి రోజే డెలివరీ.. నేడే ప్రారంభం..

తెలంగాణ పోస్టల్ సర్కిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 24 పోస్టల్ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా పార్శిళ్లను మరింత వేగంగా డెలివరీ చేయనుంది. బుక్ చేసుకున్న తర్వాతి రోజు డెలివరీ చేయనుంది. పలు నగరాల్లో మార్చి 17న ఈ సేవలను ప్రారంభించనున్నారు.

Postal: పోస్టల్ శాఖ కీలక నిర్ణయం.. బుక్ చేసుకున్న తర్వాతి రోజే డెలివరీ.. నేడే ప్రారంభం..
Speed Post Service

Updated on: Mar 17, 2026 | 7:54 AM

తెలంగాణ ప్రజలకు పోస్టల్ శాఖ సూపర్ న్యూస్ అందించింది. ’24 స్పీడ్ పోస్ట్’ సేవలను మార్చి 17న ప్రారంభించనుంది. స్పీడ్ పోస్టులు, పార్శిళ్లు వేగవంతంగా డెలివరీ చేయనుంది. ఇక నుంచి బుక్ చేసుకున్న మరుసటి రోజే పార్శిళ్లను డోర్ డెలివరీ చేయనుంది. మొదటి దశలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో మంగళవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రీమియం ఎక్స్‌ప్రెస్ సేవలను మెరుగుపర్చడంలో భాగంగా ఈ కొత్త సేవలను తీసుకొస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో ఈ సేవలను ప్రవేశపెట్టనున్నారు.

24 స్పీడ్ పోస్ట్ సేవలు

ఓటీటీ ఆధారిత సురక్షిత డెలివరీ, SMS హెచ్చరికలతో ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, వ్యాపార వినియోగదారులకు ఇప్పుడే బుక్ చేయండి, తర్వాత చెల్లించండి సౌకర్యం, బల్క్ బుకింగ్‌లకు ఉచిత పికప్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ ఇంటిగ్రేషన్, కేంద్రీకృత బిల్లింగ్, ఆలస్యం జరిగితే డబ్బు తిరిగి పొందే వంటి సౌకర్యాలు ఈ 24 స్పీడ్ పోస్ట్ సేవల ద్వారా లభించనుంది.

పార్శిల్ డిస్కౌంట్ పథకం

అటు విద్యార్థులకు ఇటీవల పార్శిల్ డిస్కౌంట్ పథకాన్ని తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రారంభించింది. స్పీడ్ పోస్ట్, రిటైల్ పార్శిల్ బుకింగ్‌లపై పది శాతం రాయితీని పోస్టల్ శాఖ అందించింది. 2026 జనవరి 1 నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది. దీంతో తెలంగాణలోని అన్ని పోస్టల్ ఆఫీసుల్లో విద్యార్థులు పంపించుకునే పార్శిళ్ల ఛార్జీలపై తగ్గింపు అందిస్తారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి విద్యార్థులు చేసే స్పీడ్ పోస్ట్ పార్శిల్స్, ఇండియా పోస్ట్ పార్శిల్స్ రిటైల్ బుకింగ్‌లపై జిఎస్‌టి లేకుండా పోస్టేజ్ ఛార్జీలపై పది శాతం తగ్గింపు ఇస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 6,259 పోస్టల్ కార్యాలయాల్లో ఇది వర్తిస్తోంది. పుస్తకాలు, స్టేషనరీ, ఎగ్జామ్ పేపర్లు, ప్రాజెక్ట్ సమర్పణలు మరియు విద్యార్థుల వ్యక్తిగత వస్తువులు వంటి విద్యా సామగ్రి రాయితీపై పంపించుకునేందుకు అవకాశం కల్పించారు.అయితే డిస్కౌంట్‌ పొందాలంటే విద్యార్థులు తప్పనిసరి ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలుచ యూనివర్సిటీలు, వృద్ది విద్య, దూర విద్యా సంస్థలకు వర్తిస్తోంది. క్లిక్ ఎన్ బుక్ పోర్టల్‌లో బుకింగ్ చేసుకునే పార్శిల్ సేవలకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

Follow Us