Independence Day: దేశభక్తిని వినూత్నంగా చాటుకున్న యువరైతులు.. పొలంలో భారత ఆకృతిని సృష్టించిన అన్నదాతలు

|

Aug 15, 2021 | 7:02 AM

Independence Day: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' పేరుతో 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను యావత్ భరతం ఘనంగా జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో పలురువు తమ దేశ భక్తిని విభిన్న రీతుల్లో ప్రకటిస్తున్నారు..

Independence Day: దేశభక్తిని వినూత్నంగా చాటుకున్న యువరైతులు.. పొలంలో భారత ఆకృతిని సృష్టించిన అన్నదాతలు
Independence Day
Follow us on

Independence Day: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ పేరుతో 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను యావత్ భరతం ఘనంగా జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో పలురువు తమ దేశ భక్తిని విభిన్న రీతుల్లో ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన యువ రైతులు కూడా తమ ఆలోచనలను ప్రతిబించేలా దేశంపై తమకు ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. పొలంలో ఇండియా మ్యాప్ ను తీర్చిదిద్దారు.

వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం యాంకి గ్రామానికి చెందిన యువ రైతు సున్నపు అశోక్‌ వినూత్నరీతిలో దేశభక్తిని చాటుకున్నాడు. ఆగష్టు 15 పురస్కరించుకొని తన పొలంలో వేసిన వరినారును భారతదేశం, తెలంగాణ మ్యాప్ లను రూపొందించాడు. నారుమడిలో వరినారును కొంచెం కొంచెంగా తొలగిస్తూ భారత దేశం మ్యాప్ ను తీర్చిదిద్దినల్టు అశోక్ చెప్పాడు.

అశోక్ రూపొందించిన భారత్ మ్యాప్ ను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అశోక్‌ చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.. దీంతో సూక్ష్మఆకృతిలో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను తయారు చేస్తున్నాడు. తనకు చిత్రకళలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే కోరిక ఉందని తెలిపారు అశోక్..

ఇక మరోవైపు ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన యువ రైతు మల్లిఖార్జున్ రెడ్డి దేశంపై తనకున్న దేశ భక్తిని వినూత్నంగా చాటాలని భావించారు. అందుకు వేదికగా తాను పండిస్తున్న పంట పొలాన్ని ఎంచుకున్నాడు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా తన వరి పొలంలో భారత్ మ్యాప్ రూపం కనిపించేలా వారిని నాటాడు. మల్లికార్జున్ రెడ్డి సేంద్రీయ వ్యవసాయం పై మక్కువ తో 2014 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. పొలం బాట పట్టాడు. ఇప్పటికే మల్లికార్జున రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డును కూడా అందుకున్నారు.

Also Read: త్రివర్ణ శోభితమైన హైదరాబాద్‌ ఐకాన్‌.. మువ్వన్నెల కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్‌.

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం.. విజయవాడలోనే జెండా పండుగ..