
Cold weather in AP and Telangana: నార్త్ ఇండియానే కాదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ఏజెన్సీల్లో మంచు దుప్పటి కమ్మేసింది. తెలుగురాష్ట్రాలను వణికిస్తుంది చలి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్యం నుంచి చలిగాలులు వేగంగా వీస్తున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువ నమోదయ్యాయి. దీంతో వచ్చే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సిర్పూర్‌లో అత్యల్పంగా 6 డిగ్రీలు కాగా.. ఏజెన్సీల్లో దట్టంగా కమ్ముకున్న మంచుతో ఉదయం బారెడు పొద్దెక్కిన బయటకువచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 3.7 డిగ్రీలు రికార్డ్ అయ్యింది. ఇక విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మినుములూరులో అత్యల్పంగా 7 డిగ్రీలుకాగా.. అరకులో 8, పాడేరులో 9, చింతపల్లిలో 9.8 డిగ్రీలు నమోదయ్యాయి. దట్టంగా అలుముకున్న పొగమంచుతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది.
వచ్చే మూడు, నాలుగు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..
Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..