Telangana: మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు.. రెండు గంటలగా కొనసాగుతున్న తనిఖీలు..

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని తిరుమలనగర్‌లో మంత్రి పీఏ ప్రభాకర్ ఇంట్లో సోదాలు..

Telangana: మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు.. రెండు గంటలగా కొనసాగుతున్న తనిఖీలు..
Minister Jagadish Reddy Pa House

Updated on: Oct 31, 2022 | 9:58 PM

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని తిరుమలనగర్‌లో మంత్రి పీఏ ప్రభాకర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. రెండు గంటల నుంచి ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు ప్రారంభమైన సమయంలో ప్రభాకర్ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక వేళ.. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు నల్లగొండలో కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ రైడ్స్‌పై టీఆర్ఎస్ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే జిమ్మిక్కులో భాగంగానే ఐటీ రైడ్స్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐటీ అధికారుల నుంచి ప్రకటన విడుదల అయితే గానీ, మ్యాటర్ ఏంటి అన్నది తెలియదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us