Hetero IT Raids: హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఈ ఉదయం నుంచీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థ డైరెక్టర్ల ఇండ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఇన్ కం ట్యాక్స్ అధికారులు. హైదరాబాద్‌తో పాటు మూడు ప్రాంతాల్లో ఇటీ సోదాలు చేస్తున్నారు ఆదాయపన్ను శాఖ అధికారులు. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇండ్లలోనూ ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి. అయితే, దాడుల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నది ఈ సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా 20 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. హెటిరో సీఈవో కార్యాలయాల్లోనూ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, కొవిడ్-19 మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమై ఆసుపత్రులో చేరిన రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హెటిరో సంస్థ మరో ఔషధం అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరిన వయోజనులకు అందించేందుకు తమ ఔషధం టొసిలిజుమాబ్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ఆఫ్ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు హెటిరో ఫార్మా ఇటీవల ప్రకటించింది. ఫలితంగా కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై స్టెరాయిడ్స్ అందుకుంటున్న లేదా ఆక్సిజన్, వెంటిలేషన్ అవసరమైన వారికి ఇచ్చేందుకు ఆసుపత్రులకు అధికారం లభించినట్లయింది.
హెటిరో టోసిరా(టొసిలిజుమాబ్) ఔషధాన్ని తమ భాగస్వామ్య సంస్థ హెటిరో హెల్త్‌కేర్ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు హెటిరో గ్రూప్ ఛైర్మన్డాక్టర్ బి.పార్థ సారధి రెడ్డి తెలిపారు. హైదరాబాద్జడ్చర్లలోని హెటిరో బయోఫార్మాలో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు పార్థసారధి రెడ్డి ప్రకటిడం విధితమే.