KTR: ఉన్నపలంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన కేటీఆర్‌.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ.

|

Mar 10, 2023 | 8:45 PM

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు రాష్ట్రంలో పార్టీ నాయకులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష ముగించారు. ఇక శనివారం కవితను ఈడీ ప్రశ్నించనుంది...

KTR: ఉన్నపలంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన కేటీఆర్‌.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ.
Ktr
Follow us on

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు రాష్ట్రంలో పార్టీ నాయకులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష ముగించారు. ఇక శనివారం కవితను ఈడీ ప్రశ్నించనుంది. దీంతో మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా ఢిల్లీ పయనం అయ్యారు. దీంతో ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

రేపటి విచారణ నేపథ్యంలో లీగల్‌ టీమ్‌తో చర్చించేందుకు కేటీఆర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మరికొంత మంది బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. శని, ఆదివారాల్లో కేటీఆర్‌ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే కవిత విచారణకు ముందే సిసోడియా రిమాండ్‌ రిపోర్ట్‌తో ఈడీ సంచలనం సృష్టించింది. సిసోడియా రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత పేరు ప్రస్తావించింది.

ఇక కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘‘రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేద్దాం, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పార్టీ నాయకులతో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..