Christmas Holidays: తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే రోజున సెలవులు ప్రకటించింది. పూర్తి వివరాలు..

Christmas Holidays: తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
Telangana Students

Updated on: Dec 23, 2025 | 2:20 PM

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు శుభవార్త అందింది. వరుసగా మూడ్రోజులు సెలవులు రానున్నాయి. క్రిస్మస్ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సెలవు కాగా.. ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ ఈవ్‌కు కూడా సెలవు ప్రకటించారు. ఇక క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా కూడా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా మూడ్రోజుల సెలవులు రానున్నాయి. ఏపీలో ఈ సెలవుల్లో కాస్త మార్పులు ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 24న ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరిచే ఉంటాయి. అయితే సెలవు కావాల్సిన వాళ్లు ఆ రోజు తీసుకోవచ్చు. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ హాలీడే కాగా.. తర్వాతి రోజు బాక్సింగ్ డే కావడంతో అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడనున్నాయి.

ఇక ఏపీ విషయానికొస్తే.. డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవు ఉంటుంది. ఇక డిసెంబర్ 24, 26 రోజులను ఆప్షనల్ హాలీడేస్ జాబితాలో చేర్చింది. క్రిస్మస్ ఈవ్ నాడు అర్ధరాత్రి ప్రార్ధనలతో పండుగ మొదలవుతుంది. ఇక డిసెంబర్ 26న జరుపుకునే బాక్సింగ్ డేకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు సంపన్నులు పేదలకు బహుమతులు అందిస్తారు. కాగా, వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు తమ బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో టూర్లు పాన్ చేసుకుంటున్నారు.