Telangana Corona Cases Updates: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 6,876 కేసులు నమోదు..

|

May 04, 2021 | 9:40 AM

Telangana Corona Cases Updates: తెలంగాణలో తగ్గినట్లే తగ్గిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం మళ్లీ పెరిగాయి.

Telangana Corona Cases Updates: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 6,876 కేసులు నమోదు..
Corona Positive
Follow us on

Telangana Corona Cases Updates: తెలంగాణలో తగ్గినట్లే తగ్గిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం మళ్లీ పెరిగాయి. సోమవారం నాడు కరోనా కేసులు 5వేలకు పైగా నమోదు అవగా.. ఇవాళ 6,876 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,961 శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా వీరిలో 6,876 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 7,432 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఒక్క రోజులోనే 59 మంది మృత్యువాత పడ్డారు.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,63,361 మంది కరోనా బారిన పడగా.. ఇందులో 3,81,365 మంది కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ బారిన పడి 2,476 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.30 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంతమంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలాఉంటే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,029 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 502 కేసులు నమోదు అయ్యాయి. ఇక మిగతా జిల్లాలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 113 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో -121, జగిత్యాల జిల్లాలో -211, కామారెడ్డి – 118, కరీంనగర్ – 264, ఖమ్మం – 235, మహబూబ్‌నగర్ – 229, మహబూబాబాద్ – 133, మంచిర్యాల – 188, నాగర్ కర్నూల్ – 190, నల్గొండ – 402, నిజామాబాద్ – 218, పెద్దపల్లి – 218, రాజన్న సిరిసిల్ల – 107, రంగారెడ్డి జిల్లాలో – 387, సంగారెడ్డి – 157, సిద్దిపేట్ – 258, సూర్యాపేట్ – 372, వికారాబాద్ – 171, వనపర్తి – 123, వరంగల్ రూరల్ – 109, వరంగల్ అర్బన్ – 354, యాదాద్రి భువనగిరి జిల్లాలో – 183 చొప్పున కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీ స్థాయిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు జిల్లాల్లోనూ పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు.

Also read:

Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా చూసి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. చిత్రయూనిట్ పై ఫిర్యాదు చేసిన

Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ..ఈ సంవత్సరం ఎప్పుడు? ఆరోజు బంగారం కొనుగోలుకు మంచి ముహూర్తం ఏది?