Revanth vs Bandi Sanjay: పార్లమెంటులో రేవంత్‌ వర్సెస్‌ బండి.. తెలుగు డైలాగులతో దుమ్ము రేపిన నేతలు..

|

Aug 12, 2023 | 8:00 AM

ఢిల్లీలో కూడా తెలంగాణ రాజకీయం మార్మోగింది. అది కూడా అచ్చ తెలుగులో పార్లమెంటులో ప్రతిధ్వనించింది. లోక్‌సభలో టీ కాంగ్రెస్ చీఫ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి.. తమ పొలిటికల్‌ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. లిక్కర్ పార్టీ, నిక్కర్‌ పార్టీ అంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీలపై దాడి చేశారు. అది కూడా తెలుగులో. ఇక బండి సంజయ్‌ కూడా సేమ్‌ టు సేమ్‌. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు గురి పెట్టి మరీ.. తెలుగులో మాటల తూటాలు పేల్చారు. ఇద్దరు తెలంగాణ నేతలు తెలుగులో మాటకు మాట అంటూ పార్లమెంటులో రాజకీయ మంటలు రేపారు.

Revanth vs Bandi Sanjay: పార్లమెంటులో రేవంత్‌ వర్సెస్‌ బండి.. తెలుగు డైలాగులతో దుమ్ము రేపిన నేతలు..
Bandi Sanjay Kumar Vs Revanth Reddy
Follow us on

తెలుగు దంగల్‌. యస్‌. తెలుగులో రాజకీయం రచ్చ రేపింది. అక్కడా ఇక్కడా కాదు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో. అందులోనూ పార్లమెంటు సాక్షిగా తెలుగు మాటలు.. మంటలు పుట్టించాయి. మొదట రేవంత్‌రెడ్డి బిగిన్‌ చేస్తే.. తర్వాత బండి సంజయ్ అందుకున్నారు. అచ్చ తెలుగులో రాజకీయం మాట్లాడితే ఎట్టా ఉంటాదో ఢిల్లీకి రుచి చూపించారు. రేవంత్‌ వర్సెస్‌ బండి.. తెలుగులో పేలిన డైనమైట్ల లాంటి డైలాగులకు పార్లమెంట్‌ దద్దరిల్లింది.

గల్లీలో కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా తెలంగాణ రాజకీయం మార్మోగింది. అది కూడా అచ్చ తెలుగులో పార్లమెంటులో ప్రతిధ్వనించింది. లోక్‌సభలో టీ కాంగ్రెస్ చీఫ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి.. తమ పొలిటికల్‌ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. లిక్కర్ పార్టీ, నిక్కర్‌ పార్టీ అంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీలపై దాడి చేశారు. అది కూడా తెలుగులో. ఇక బండి సంజయ్‌ కూడా సేమ్‌ టు సేమ్‌. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు గురి పెట్టి మరీ.. తెలుగులో మాటల తూటాలు పేల్చారు. ఇద్దరు తెలంగాణ నేతలు తెలుగులో మాటకు మాట అంటూ పార్లమెంటులో రాజకీయ మంటలు రేపారు. లోక్‌సభ సాక్షిగా తెలంగాణ తీన్‌మార్‌ రాజకీయం తెలుగులో దుమ్ము రేపింది.

ఇక ఆ తర్వాత నేనున్నా అంటూ రంగంలోకి దిగారు కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ బండి సంజయ్‌. రేవంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ లిక్కర్‌ పార్టీ కాదని.. కాంగ్రెస్సే లిక్కర్‌ పార్టీ అంటూ ఏకి పడేశారు. నిక్కర్లు అంటూ ఎగతాళి చేయడం కాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లకు దేశభక్తి ఉంటుందని రేవంత్ గ్రహించాలన్నారు. తెలంగాణ రాజకీయం.. అచ్చ తెలుగులో తీన్‌మార్‌ స్టైల్లో పార్లమెంటులో రచ్చ రేపింది.

ఇవి కూడా చదవండి

నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్‌ ఉభయసభలు..

వాడివేడిగా సాగిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ, కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ఉభయ సభల్లో ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. జూలై 20వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో లోక్‌సభ 17సార్లు భేటీ అయింది. ఈ సమావేశంలో 44 గంటల 15 నిమిషాల పాటు లోక్‌సభ కొలువుదీరింది. ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులు ప్రవేశపెట్టారు. 22 బిల్లులను సభ ఆమోదించింది.

మణిపూర్‌లో చెలరేగిన హింస, వెలుగు చూసిన వీడియోలపై పార్లమెంట్‌ ఉభయ సభలు అట్టుడికాయి. మణిపూర్‌ హింసపై ప్రధాని సభలో స్వయంగా ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో చాలా రోజులు సభల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. హడావుడి, గందరగోళం మధ్య మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదం లభించడం జరిగింది. విపక్షాల ఆందోళన మధ్యే ఢిల్లీ సర్వీసు బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మణిపూర్‌ హింసపై ప్రభుత్వ సమాధానాన్ని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దానిపై సభ మూడు రోజుల పాటు చర్చించింది. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 20 గంటల పాటు జరిగిన చర్చలో వివిధ పార్టీలకు చెందిన 60 మంది సభ్యులు పాల్గొన్నారు. అవిశ్వాసంపై ప్రధాని నరేంద్ర మోదీ 2 గంటలకు పైగా సమాధానమిచ్చారు.

మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ప్రవర్తన సభామర్యాదకు భంగకరంగా ఉందని చెప్తూ ఆయనను లోక్‌సభ సస్పెండ్‌ చేసింది. అధీర్‌ రంజన్ వ్యవహారాన్ని లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ నివేదిక వచ్చి, దానిపై నిర్ణయం తీసుకునేంత వరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

అటు మణిపూర్‌ హింసపై రాజ్యసభ దద్దరిల్లింది. ఏ నిబంధనపై చర్చ జరగాలనే దానిపై అధికార, విపక్షాల మధ్య సఖ్యత కుదరకపోవడంతో చర్చించేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అదే సమయంలో ఆప్‌ సభ్యుల ప్రవర్తనన సభా మర్యాదకు అనుగుణంగా లేదని చెప్తూ జూలై 24న సంజయ్‌సింగ్‌ను రాజ్యసభ సస్పెండ్‌ చేసింది. సమావేశాల చివరి రోజు సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో మరో ఆప్‌ సభ్యుడు రాఘవ్‌ ఛడ్డాను సభ సస్పెండ్‌ చేసింది. ఇద్దరు ఆప్‌ ఎంపీల వ్యవహారాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ నివేదిక వచ్చి, దానిపై నిర్ణయం తీసుకునేంత వరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ ప్రకటించారు. ఈ సమావేశాల్లోనే ఢిల్లీ ఆర్డినెన్స్‌ స్థానంలో తెచ్చిన వివాదాస్పద బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..