లక్ష్మీదేవి వస్తానంటే.. ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. డబ్బు రూపంలో ఉన్న అమ్మను కళ్లకు అద్దుకుని మరీ తీసుకుంటారు. అయితే, ఇక్కడి ఏటీఎం స్థానిక ప్రజల పాలిట లక్ష్మీదేవిలా మారింది. వారు కొంత డబ్బు కోరితే.. అందుకు నాలుగు రెట్ల డబ్బును ఇస్తోంది. దాంతో ప్రజలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అవును ఏటీఎంల నుంచి నోట్ల వర్షం కురుస్తోంది. వద్దన్నా డబ్బు వరదలా బయటకొస్తోంది. రూ. 500 కొడితే.. ఏకంగా రూ. 2,500 వస్తోంది. దొరికిందే ఛాన్స్ అంటూ.. స్థానిక జనాలంతా ఆ ఏటీఎం వద్దకు వచ్చి.. అందినకాడికి ఎత్తుకెళ్లిపోతున్నారు. దాంతో ఆ ఏటీఎం వద్ద జనం జాతరలా గుమిగూడారు. ఏటీఎం నుంచి రూ. 500 కొట్టి.. రూ. 2,500 పట్టుకెళ్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని హరిబౌలి చౌరస్తాలొ గల హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోటు చేసుకుంది. ఏటీఎం వద్ద ప్రజలు భారీగా క్యూలో నిల్చున్నారు. అయితే, డబ్బుల వర్షానికి సంబంధించిన మసాచారం ఇంకా బ్యాంకు అధికారులకు అందనట్లుంది. ఇప్పుడు డ్రా అయిన డబ్బుల పరిస్థితి ఏంటనేది తరువాత తేలుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..