తెలంగాణలోనూ మోంథా తుపాన్ ఎఫెక్ట్.. వచ్చే 2 రోజులు అతి భారీ వర్షాలు! జాగ్రత్తలు షురూ

రాగల 12 గంటలలో మోంథా తుఫాను ఉత్తర, వాయువ్యదిశలో కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఇంచు మించు కాకినాడకు సమీపంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో..

తెలంగాణలోనూ మోంథా తుపాన్ ఎఫెక్ట్.. వచ్చే 2 రోజులు అతి భారీ వర్షాలు! జాగ్రత్తలు షురూ
Cyclone Montha In Telangana

Updated on: Oct 28, 2025 | 5:48 PM

హైదరాబాద్, అక్టోబర్‌ 28: రాగల 12 గంటలలో మోంథా తుఫాను ఉత్తర, వాయువ్యదిశలో కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఇంచు మించు కాకినాడకు సమీపంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ రోజు తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు తెలంగాణ లోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ , సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ఇక రేపు తెలంగాణ లోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రేపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణలోని నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఈ రోజు, రేపు తెలంగాణ లోని దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.