Toll Plaza: ఇదేం టోల్ దంచుడు రా బాబూ..! సూచిక బోర్డులు ఒక చోట.. వసూళ్లు మరోచోట

నిర్మల్ జిల్లాలోని ఆ టోల్ ఫ్లాజా సమస్యలకు‌ అడ్డగా మారుతోంది. నిబంధనల ప్రకారం నాలుగు రహదారుల రోడ్డు ఉండాల్సిన చోట కేవలం డబుల్ రోడ్ లోనే టోల్ ప్లాజా ఏర్పాటు చేసి ఏళ్లకు ఏళ్లుగా వాహనదారుల టోల్ తీస్తున్నారు అక్కడి నిర్వహకులు. ఆ టోల్ ఫ్లాజా వద్ద కనీసం చూద్దమన్నా కనుచూపు మేరలో సూచిక బోర్డులు కనిపించవు. రాత్రి అయితే కనీసం అక్కడో టోల్ ప్లాజా ఉందన్న హెచ్చరిక బోర్డ్ కూడా దర్శనం ఇవ్వదు.

Toll Plaza:  ఇదేం టోల్ దంచుడు రా బాబూ..! సూచిక బోర్డులు ఒక చోట.. వసూళ్లు మరోచోట
Dilawarpur Toll Plaza
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Feb 21, 2024 | 6:28 PM

నిర్మల్ జిల్లాలోని ఆ టోల్ ఫ్లాజా సమస్యలకు‌ అడ్డగా మారుతోంది. నిబంధనల ప్రకారం నాలుగు రహదారుల రోడ్డు ఉండాల్సిన చోట కేవలం డబుల్ రోడ్ లోనే టోల్ ప్లాజా ఏర్పాటు చేసి ఏళ్లకు ఏళ్లుగా వాహనదారుల టోల్ తీస్తున్నారు అక్కడి నిర్వహకులు. ఆ టోల్ ఫ్లాజా వద్ద కనీసం చూద్దమన్నా కనుచూపు మేరలో సూచిక బోర్డులు కనిపించవు. రాత్రి అయితే కనీసం అక్కడో టోల్ ప్లాజా ఉందన్న హెచ్చరిక బోర్డ్ కూడా దర్శనం ఇవ్వదు. వసతుల మాట దేవుడెరుగు వాహనదారుడి పాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేవా గంటల పాటు నిరిక్షీంచక తప్పని దుస్థితి. ఇది నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ టోల్ ఫ్లాజా పరిస్థితి. సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు దిలావర్ పూర్ టోల్ ప్లాజా సిబ్బంది.

టోల్ ప్లాజా అంటే ఒక కిలోమీటరు ముందు నుండే సూచిక బోర్డులు ఉంటాయి. భారీ వాహనాలు ఒకవైపు, కార్లు, జీపులు పోర్ వీలర్స్ వాహనాలు మరోవైపు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేకమైన దారి‌ ఉండాలి. కానీ‌ అక్కడ కనిపిస్తున్న ఈ టోల్ ఫ్లాజాలో మాత్రం అలాంటివేమి కనిపించవు. ఇది నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ టోల్ ప్లాజ్ పరిస్థితి. ఇవే కావు ఈ టోల్ ప్లాజాలో కనీసం చూద్దామన్నా కనీస వసతులు కనిపించవు. ఒకవేళ మీ పాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేవా ఇక అంతే సంగతులు అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అడిగినంత సమర్పించుకోవాల్సిందే.. కారణం ఏ వాహనానికి ఎంత డబ్బు చెల్లించాలన్నా బోర్డు చూద్దామన్నా కనిపించదు. ఇక్కడితోనే ఆగిపోలేదు దిలావర్ పూర్ టోల్ ప్లాజా సమస్యల చిట్టా.. సిబ్బంది నిర్వహకం అంతకు మించి అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ.

మహారాష్ట్ర కళ్యాణి నుండి తెలంగాణ నిర్మల్ జిల్లా‌ను‌ కలుపుతూ ఎన్ హెచ్ 61 లో భాగంగా 2019 లో ఈ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. అసలు ఈ టోల్ ప్లాజాను బైంసా మండలంలోని మాటేగాం వద్ద ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ సమయంలో ఉన్నపళంగా ఈ టోల్ ప్లాజాను ఆగమేఘాల మీద ఎలాంటి వసతులు లేకుండానే ప్రారంభించారు. అలా ప్రారంభమైన టోల్ ప్లాజా 5 ఏళ్లుగా ఎలాంటి వసతులు లేకుండా కనీస నిబందనలు కొనసాగుతోంది. ప్రతి రోజు ఈ టోల్ ప్లాజా గుండా 4,000 పైగానే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కోట్ల ఆదాయం వస్తున్నా వసతుల విషయంలో మాత్రం ఈ టోల్ ప్లాజా నిర్వహకులు‌ పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

“బిల్డ్ అండ్ ఆపరేట్” పద్ధతిలో ఈ రోడ్లను నిర్వహిస్తున్న ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ’ సౌకర్యాలు, రోడ్ల నిర్వహణ లో మాత్రం తేలిపోతోంది. ఇదేంటని దిలావర్ పూర్ టోల్ ప్లాజా నిర్వహకులను నిలదీస్తే మీ‌దిక్కున్న చోట చెప్పుకోడంటూ సమాధానం వినిపిస్తోంది. సిబ్బంది దురుసు ప్రవర్త తో ఈ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదు. అసలు ఈ టోల్ ప్లాజా ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిర్మాణమైనా.. ఈ టోల్ ప్లాజా తొలగించాలంటూ స్థానికులు కోర్ట్ కు ఎక్కినా ఫలితం లేకుండా పోయింది. ఈ టోల్ ప్లాజాను మాటేగాం వద్ద ఏర్పాటు చేసేందుకు 2018 కు ముందే అన్ని నింబదనలను పాటిస్తూ డివైడర్లను నిర్మించి.. సూచిక బోర్డ్ లను‌ ఏర్పాటు చేసి.. టోల్ వసూలు రూంలను‌ నిర్మించినా దానిని వినియోగంలోకి తేకుండా హుటాహుటిన దిలావర్ పూర్ లో టోల్ ప్లాజా ఏర్పాటు‌చేయడం అప్పట్లో వివాదస్పద మైంది.

ఆ వివాదం ఐదేళ్లైనా ఇంకా కొనసాగుతూనే ఉంది. సూచిక‌బోర్టులు 20 కిలో మీటర్ల దూరంలో మాటేగాంలో ఉండగా.. అసలు టోల్ ప్లాజా ఉన్న దిలావర్ పూర్ టోల్ ప్లాజా వద్ద మాత్రం ఎలాంటి సూచిక బోర్డులు కనిపించకపోవడం వివాదాలకు కారణం అవుతూనే ఉంది. నిత్యం వాహనదారులు టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి నిలిచిపోవడం.. ఎంట్రీ ఎక్సిట్ లకు ఒకే టోల్ గేట్ ఉండటం కూడా వాహనదారులకు ఇక్కట్లను‌ కలిగిస్తూనే ఉంది. ఎలాంటి వసతులు లేని దిలావర్ పూర్ టోల్ ప్లాజాను‌ తొలగించి సకల సౌకర్యాలు ఉండి వినియోగంలో లేకుండా పోయినా మాటేగాం టోల్ ప్లాజాను వెంటనే వినియోగ లోకి తేవాలన్న డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.

ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా కోట్లల్లో ఆదాయం వస్తున్నా నిర్మల్ జిల్లాలోని టోల్‌ప్లాజాల వద్ద మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు. దీనిపై స్థానికులు ఏండ్లుగా ప్రశ్నిస్తున్నా ఎన్‌హెచ్‌ఏఐ పట్టించుకోవడం లేదు. ఈ రహదారుల నిర్వహణ విషయమై కాంట్రాక్టు తీసుకున్న సంస్థ చార్జీలతో పాటే సౌకర్యాల కల్పనపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే స్థానికంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల వాసులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై పెదవి విరుస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం సమయంలో ఇచ్చిన హామీలపై ఏండ్లుగా అడుగుతున్నా స్పందించడం లేదని మండిపడుతున్నారు. అయితే ప్రయాణికుల కోసం కనీసం సరైన మూత్రశాలలు కూడా లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణనాతీతం. ఇరుకైన టోల్ గేట్ లతో ఇబ్బందులు తప్పడం లేదు.

రోడ్ల నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉండది. రోడ్లమీద గుంతలు పడినపుడు వాటి మరమ్మతులు కూడా తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు కొంత భాగం మాత్రమే బీ టీ వేయటం వల్ల ఎగుడు దిగుడు గా మారి ద్విచక్ర వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.పలుచోట్ల రోడ్లు సరిగా లేని కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్న ఘటనలు జరిగాయి. ఈ రోడ్డు గుండా రాష్ట్ర మంత్రులు, ఉన్నత హోదాల్లో ఉన్న అధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సౌకర్యాల కల్పన, రోడ్ల నిర్వహణపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!