iBOMMA: ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ నుంచి ఫస్ట్ మెసేజ్.. ఏంటంటే?

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ గత రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చినీయాంశంగా మారింది. అయితే రవి అరెస్ట్ తర్వాత ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను పోలీసులు డిలీట్ చేయించారు. కానీ తాజాగా ఐబొమ్మ వెబ్‌సైట్ నుంచి మరోసారి మెసేజ్ వచ్చింది. ఇంతకు ఆ మెసేజ్‌లో ఏముంది. ఐబొమ్మ ఏం చెప్పిందో తెలుసుకుందాం పదండి.

iBOMMA: ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ నుంచి ఫస్ట్ మెసేజ్.. ఏంటంటే?
Ibomma

Updated on: Nov 17, 2025 | 5:05 PM

ఐబొమ్మ.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం. ఇది ఇంతలా ఫేమస్ అవ్వడానికి కారణం.. ఐబొమ్మ నిర్వాహకులు కొన్ని రోజులు క్రితం పోలీసులనే సవాల్‌ చేస్తూ ఒక మెసేజ్ రిలీజ్ చేయడం.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండని సవాల్‌ చేసిన ఐబొమ్మకు పోలీసులు.. నిజంగానే బొమ్మను చూపించారు. ఇన్నాళ్లుగా కనిపించకుండా దాక్కున్న ఐబొమ్మ నిర్వాహకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడితోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను డిలీట్‌ చేయించారు.

అయితే ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్టైన రెండ్రోజుల తర్వాత మళ్లీ ఆ వెబ్‌సైట్‌ నుంచి ఒక మెసెజ్ వచ్చింది. అందులో ఐబొమ్మ ఇలా రాసుకొచ్చింది. ఐబొమ్మ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ మధ్య కాలంలో మీరు మా గురించి వినే ఉంటారు.. మీకు మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు.. కానీ ఇప్పుడు మేం మా సేవలను నిలిపి వేస్తున్నాం.. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు మేం చింతిస్తున్నాం.. అందుకు మేం మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నామని ఐ-బొమ్మ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Ibomma

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.