HYDRA Target: ఆల్రెడీ కూల్చాల్సిన జాబితా సిద్ధం.. ఇంతకీ, ఆ లిస్టులో ఉన్న బిల్డింగులేంటి..?

| Edited By: Balaraju Goud

Aug 31, 2024 | 9:29 PM

ఎక్కడ చూసినా కూల్చివేతల సంచలనమే. మేడ్చల్ - రంగారెడ్డి జిల్లాలలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులుపిస్తున్న విషయం తెలిసిందే..! ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ దారులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

HYDRA Target: ఆల్రెడీ కూల్చాల్సిన జాబితా సిద్ధం.. ఇంతకీ, ఆ లిస్టులో ఉన్న బిల్డింగులేంటి..?
Av Ranganath Hydra
Follow us on

స్టే తెచ్చుకునే లోపు బిల్డింగులను పడగొడుతోంది బుల్డోజర్. హైడ్రా స్పీడ్‌ ఆ రేంజ్‌లో ఉంది. తెల్లవారుతూనే.. ఫలానా చోట కూల్చివేతలు అనే బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తూనే ఉంది. తాజాగా బీజేపీ నేతకు చెందిన గోడౌన్స్‌పైకి దూసుకెళ్లింది బుల్డోజర్. వారాంతాల్లో జోరుమీదుంటున్న హైడ్రా.. ఆల్రెడీ ఆదివారం కూల్చాల్సిన జాబితా కూడా సిద్ధం చేసుకుంది. ఇంతకీ, ఆ లిస్టులో ఉన్న బిల్డింగులేంటి?

ఇప్పుడు ఎక్కడ చూసినా కూల్చివేతల సంచలనమే. మేడ్చల్ – రంగారెడ్డి జిల్లాలలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులుపిస్తున్న విషయం తెలిసిందే..! ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ దారులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలా చోట్ల కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా టీమ్. ఎఫ్‌టిఎల్ తోపాటు బఫర్ జోన్ లో ఉన్న నివాసాలకు నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా తోపాటు మేడ్చల్ జిల్లాలో ఉన్న రెవెన్యూ అధికారులు 13 చెరువుల చుట్టూ సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.

వీటిలో దుర్గం చెరువు పరిధిలో 204 అక్రమ ఇల్లులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. బఫర్ జోన్ ఎఫ్డిఎల్ ప్రాంతాల్లో నివాసాలను ఏర్పరచుకున్న వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి 30 రోజుల వరకు గడువు ఇచ్చారు. తమంతట తాము ఈ నిర్మాణాలను కూల్చివేయాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో తామే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. ఏడాది ఫిబ్రవరిలో అధికారులు నిర్వహించిన సర్వేలో సుమారు 1100 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఇండిపెండెంట్ హౌస్ లతో పాటు అపార్ట్మెంట్లను సైతం ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్లలో నిర్మించినట్టు అధికారులు గుర్తించారు.

1100 అక్రమ నిర్మాణాల్లో 462 ఎఫ్టిఎల్ జోన్లో ఉండగా 634 బఫర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ శాతం 13 చెరువుల చుట్టే నిర్మాణాలు ఏర్పరచుకున్నట్టు వెళ్లడైంది. 13 చెరువుల్లో అత్యధికంగా ఓల్డ్ బోయిన్పల్లి లో ఉన్న హస్మత్ పేట్ (బోయిన్ చెరువు )ఎఫ్ టి ఎల్ పరిధిలో సుమారు 148 అక్రమ బిల్డింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. అల్వాల్ లో ఉన్న చిన్న రాయుని చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో 105 అక్రమ నిర్మాణాలను గుర్తించారు.

ఈ 13 చెరువుల చుట్టూ అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో పాటు అడ్వకేట్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఫిబ్రవరలో ఈ సర్వే నిర్వహించారు. వీటిపై తెలంగాణ హైకోర్టుకు నివేదిక సైతం ఈ ఏడాది మార్చిలోనే సబ్మిట్ చేశారు. చెరువుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడింది. గ్రౌండ్ లెవెల్ రివ్యూ కోసం వెళ్లిన కమిటీకి చెరువులకనీస రక్షణ కర్వడినట్లు రిపోర్టును హైకోర్టుకు సబ్మిట్ చేశారు. చాలా చెరువుల వద్ద కనీసం సీసీటీవీ కెమెరాలతో పాటు చెరువులను పరిరక్షించే సెక్యూరిటీ గార్డును సైతం నియమించలేదని పేర్కొన్నారు.

హస్మత్ పెట్టు బోయిన్ చెరువులో 148 ఎఫ్.టి.ఎల్ అక్రమ నిర్మాణాలు ఉండగా 52 బఫర్ జోన్ లో నిర్మాణాలు ఉన్నాయి. అల్వాల్ లో ఉన్న చిన్న నారాయణి చెరువులో 105 ఎఫ్.టి.ఎల్ జోన్లో ఉండగా 80 బఫర్ జోన్ లో ఉన్నాయి. దుండిగల్ వద్ద ఉన్న చిన్న దామెర చెరువులో మూడు ఎఫ్టిఎల్ నిర్మాణాల్లో ఉండగా ఉన్నాయి. గంగారం పెద్ద చెరువు వద్ద బఫర్ జోన్ లో 65 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. అల్లాపూర్ సున్నం చెరువు వద్ద ఎఫ్డిఎల్లో 77 నిర్మాణాలు 30 బఫర్ జోన్ లో ఉన్నట్లు గుర్తించారు. గౌలిదొడ్డి ప్రాంతంలో గోసాయికుంట చెరువు పరిసరాల్లో 23 అక్రమ నిర్మాణాల్లో బఫర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఉప్పల్ నల్లచెరువు వద్ద 26 అక్రమ నిర్మాణాల్లో బఫర్ జోన్ లో ఉన్నట్లు గుర్తించారు. ఫిర్జాదిగూడ పెద్ద చెరువు వద్ద బఫర్ జోన్ లో 100కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.

ఆదివారం హైడ్రా బుల్డోజర్లకు బిగ్‌డే లాంటిది. అందరికీ సన్‌డే హాలిడే.. కానీ, హైడ్రా బుల్డోజర్‌కు ఓవర్‌టైమ్‌ పని. ఇప్పటికే, కూల్చాల్సిన బిల్డింగుల జాబితా కూడా రెడీ చేసుకున్నారంటున్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అమీన్‌పూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. చెరువుల కబ్జాలపై అడ్వకేట్‌ రవికృష్ణ ఫిర్యాదు చేయడంతో శంభుని కుంట, బంధం కొమ్ము, చక్రపురి కాలనీ, అమీన్‌పూర్‌ పెద్ద చెరువులను పరిశీలించారు. ఆక్రమణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..