YS Sharmila: బెంగళూరు నుంచి హైదరాబాద్‌ చేరుకున్న వైఎస్‌ షర్మిల… కాసేపట్లో పలువురు నేతలతో భేటీ..

YS Sharmila Meeting With Rangareddy Leaders:తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు చెప్పకనే చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం...

YS Sharmila: బెంగళూరు నుంచి హైదరాబాద్‌ చేరుకున్న  వైఎస్‌ షర్మిల... కాసేపట్లో పలువురు నేతలతో భేటీ..
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల

Updated on: Feb 15, 2021 | 6:50 AM

YS Sharmila Meeting With Rangareddy Leaders:తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు చెప్పకనే చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే తన లక్ష్యమని చెప్పిన షర్మిల హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో తన నివాసంలో నల్గొండ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లారు.
ఇదిలా ఉంటే.. ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళం నిర్వాహించాలని భావించిన షర్మిల.. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే గతకొన్ని రోజులుగా బెంగళూరులో ఉన్న షర్మిల తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు లోటస్‌పాండ్‌లో హైదారాబాద్‌, రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలతో భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత షర్మిల ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: Nagarjuna Sagar Bypoll: మిషన్ భగీరథ వాటర్.. జానారెడ్డి వర్సెస్ టీఆర్ఎస్.. వరుసగా ఆసక్తికర ఘటనలు..!