Youtube Star Shanmukh Jaswanth: తప్ప తాగి డ్రైవింగ్.. ఏకంగా మూడు వాహనాలు ఢీకొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్

Youtube Star Shanmukh Jaswanth Arrest: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  మద్యం మత్తులో కారు నడిపి ఉడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్స్ వద్ద మూడు వాహనాలను...

Youtube Star Shanmukh Jaswanth: తప్ప తాగి డ్రైవింగ్.. ఏకంగా మూడు వాహనాలు ఢీకొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్

Updated on: Feb 28, 2021 | 10:43 AM

Youtube Star Shanmukh Jaswanth Arrest: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  మద్యం మత్తులో కారు నడిపి ఉడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్స్ వద్ద మూడు వాహనాలను ఢీకొట్టాడు తెలుగు యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్. ఈ ఘటనలో  ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ప్రాథమిక చికిత్స అందించి.. ఆస్పత్రికి తరలించారు.  షణ్ముక్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా..  170 రీడింగ్ వచ్చింది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షణ్ముక్ ర్యాష్ డ్రైవింగ్ చేసి.. వాహనాలకు ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు.

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా షణ్ముక్ చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్ అతని క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు షణ్ముక్. అంతేకాదు.. తెలుగు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ కవర్ చేస్తూ కూడా గుర్తింపు పొందాడు. యూట్యూబ్‌లో షణ్ముక్ ఫాలోవర్స్ దాదాపు మూడు కోట్ల మంది ఉన్నారంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, తాజాగా షణ్ముక్ బిగ్ బాస్ ఫేమ్ దీప్తీ సునైనాతో ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..

ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త అకౌంట్ తీసుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తప్పకుండా పాటించాలి…