Hyderabad: బీ అలెర్ట్… రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేస్తే.. ఇకపై జైలుకే..

| Edited By: Ram Naramaneni

Jun 22, 2024 | 1:49 PM

ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే కావడంతో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. పట్టుపడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి జైలుకు పంపనున్నారు.

Hyderabad: బీ అలెర్ట్...  రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేస్తే.. ఇకపై జైలుకే..
Wrong Side Driving
Follow us on

హైదరాబాద్‌లో కొందరు వాహనదారులు.. భయం, భక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ ఫోలిస్ ఉండే సర్కిల్ వద్ద కూడా రాంగ్‌ రూట్‌‌లో ప్రయాణిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాంగ్ రూట్‌ డ్రైవింగే ప్రధాన కారణమని గుర్తించిన పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ మరింత స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యాక్షన్‌లోకి దిగారు సైబరాబాద్‌ పోలీసులు. అంతేకాదు రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిపై.. 336 సెక్షన్ కింద కేసు ఫైల్ చేయడం షుర్ చూశారు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై సంబంధిత లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి, చార్జీషీట్‌ ఫైల్ చేస్తున్నారు.

శుక్రవారం ఒక్కరోజే సైబరాబాద్‌ కమిషనరేట్‌ జోన్‌లో రాంగ్‌ రూట్‌‌లో వాహనాలు.. నడిపిన 93 మందిని గుర్తించి కేసులు బుక్ చేశారు. అందులో 11 మందిపై FIR నమోదు చేశారు. అత్యధికంగా గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో 32 మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ పట్టుపడినట్లు తెలిపారు. వారిలో నలుగురిపై FIRలు నమోదు చేశామన్నారు. KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు పట్టుబడగా, ఒకరిపై FIR ఫైల్ అయింది. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపడం వల్ల రాంగ్‌సైడ్‌ వచ్చే వాహనదారులకే కాకుండా.. సవ్యమైన మార్గంలో వస్తున్నవారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఫైన్స్ వేసినా కొందరిలో మార్పు రావడం లేదు. అందుకే ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై సెక్షన్‌ 336 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇలా రాంగ్ రూట్స్‌లో వాహనాలు నడిపేవారిని ట్రాక్ చేసేందుకు.. పలు ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో.. ఇకపై రాంగ్ రూట్‌లో వెళ్లారంటే.. మీరు జైలుకు వెళ్లాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి