Hyderabad: ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్‌.. మన ర్యాంక్ ఎంతంటే?

ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు ప్రధాన నగరాలు స్థానం దక్కించుకున్నాయి. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025’ ర్యాంకింగ్స్‌లో బెంగళూరు, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా గ్లోబల్ టాప్‌-100లో నిలిచింది. జీవన నాణ్యత నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, టెక్‌ గ్రోత్‌ నుంచి సాంస్కృతిక వైవిధ్యం వరకు మొత్తం 34 జిల్లాల్లో విశ్లేషణ జరిపి ఈ ర్యాంకులు ప్రకటించారు.

Hyderabad: ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్‌.. మన ర్యాంక్ ఎంతంటే?
World's Best Cities 2025

Edited By:

Updated on: Nov 27, 2025 | 3:13 PM

ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు ప్రధాన నగరాలు స్థానం దక్కించుకున్నాయి. వాటిలో బెంగళూరు, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా గ్లోబల్ టాప్‌-100లో నిలిచింది. సాంకేతిక విస్తరణ, ఆధునిక మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ అవకాశాలు, నగర జీవనశైలిలో వేగవంతమైన మార్పులు.. ఇవి హైదరాబాద్‌కు ఈసారి కీలకమైన ప్లస్ పాయింట్లుగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్‌ నగరాల జాబితో బెంగళూరు 29వ స్థానం, ముంబై 40వ స్థానం, ఢిల్లీ 54వ స్థానం సాధించగా.. హైదరాబాద్‌ 82వ స్థానంలో నిలవగా.. దేశవ్యాప్తంగా నాల్గవ బెస్ట్ సిటీగా నిలిచింది. చెన్నై, కోల్‌కతా వంటి పాత మెట్రో నగరాలను వెనక్కు నెట్టి ఈ స్థానం పొందడం ప్రత్యేకంగా మారింది.

హైదరాబాదీ రుచులకు గ్లోబల్ గుర్తింపు..

హైదరాబాద్ కేవలం ఐటీ, బిజినెస్ హబ్ మాత్రమే కాదు.. ప్రపంచ ఫుడ్ మ్యాప్‌లో కూడా తనదైన స్థానం సంపాదిస్తోంది. ‘టేస్టీ అట్లాస్’ విడుదల చేసిన టాప్ 100 టేస్టీ సిటీల జాబితాలో హైదరాబాద్‌ 50వ స్థానంలో నిలిచింది. బిర్యానీ, ఇరానీ టీ, హలీమ్, ఉస్మానియా బిస్కెట్ ఇలాంటి వంటకాల ప్రత్యేక రుచులు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మొఘలాయి, అరబిక్, పర్షియన్, టర్కిష్ వంటకాల ప్రభావంతో హైదరాబాదీ ఫుడ్ కల్చర్‌కు ఈ గుర్తింపు మరింత బలం చేకూర్చింది.

ప్రపంచంలో టాప్-10 బెస్ట్ సిటీస్

ఇక ప్రపంచంలో టాప్-10 బెస్ట్ సిటీస్ సిటీస్ జాబితాకు వస్తే క్యాపిటల్ ఆఫ్ క్యాపిటల్స్’గా పేరున్న లండన్ మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, మాడ్రిడ్, సింగపూర్, రోమ్, బెర్లిన్ ఉన్నారు. అభివృద్ధి, వినోదం, పర్యాటకం, జీవనశైలి అన్ని విభాగాల్లో ఈ నగరాలు ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

రోజురోజుకూ హైదరాబాద్‌ గ్లోబల్ ఇమేజ్ మరింత బలపడుతోంది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరుసగా మెరుగైన స్థానాలు సాధించడం హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్తోంది. టెక్ సిటీగా గుర్తింపు, సురక్షిత నగరంగా పేరుగాంచడం, ఫుడ్ డెస్టినేషన్‌గా ఎదగడం all combined గా హైదరాబాద్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మరింత ఉన్నత స్థానాలను అందుకునే సామర్థ్యం నగరానికి ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.