AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మహిళలకు మరో స్వీట్ న్యూస్.. ఇకపై ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఇప్పటి వరకు సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం. కాగా.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపించింది రేవంత్ సర్కార్. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. టీఎస్ ఆర్టీసీ కొత్తగా మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో కూడా....

Hyderabad: మహిళలకు మరో స్వీట్ న్యూస్.. ఇకపై ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
Electric Bus
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2024 | 11:03 AM

Share

తెలంగాణ సర్కార్.. రాష్ట్రంలోని మహిళలకు వరసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది. మహిళల స్థితిగతులను మార్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. విప్లవాత్మక పథకాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడగానే.. మహాలక్ష్మి పేరుతో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేశారు. కొట్లాది మంది మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కాగా.. ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్  చెప్పింది రేవంత్ సర్కార్.

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో.. TSRTC కొత్తగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఎన్టీఆర్‌ మార్గ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం వద్ద 25 బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆగస్టు వరకు మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇవి ఒక్కసారి ఛార్జింగ్‌తో 225 కి.మీ వరకు ప్రయాణిస్తాయి. పూర్తిగా ఛార్జింగ్ ఎక్కేందుకు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది. అదనంగా, ఈ బస్సుల్లో భద్రతా కెమెరాలు, పానిక్ బజర్, రివర్స్ పార్కింగ్ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ (FDAS) ఉన్నాయి.

ఈ మెట్రో ఎలక్ట్రిక్ బస్సులకూ మహాలక్ష్మి పథకం కింద  మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్‌తో ఈ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.

కాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణించే ప్రతీ మహిళకు ‘జీరో టికెట్’ జారీ చేస్తున్నారు. మహిళలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తం ఛార్జీని ప్రభుత్వం TSRTCకి చెల్లిస్తుంది. కాగా మహిళలు తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చు. బయటి రాష్ట్రాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లగలరు, తరువాత టికెట్ కొనాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..