Hyderabad: కట్టుకున్న భార్యపై దారుణం.. బలవంతంగా మద్యం తాగించి.. విచక్షణ రహితంగా కొట్టి..

|

Apr 30, 2022 | 6:45 PM

అనుమానం పెంచుకున్న ఓ భర్త.. తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. బలవంతంగా మద్యం తాగించి.. తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ రప్పించాడు. అంబులెన్స్ రాకతో....

Hyderabad: కట్టుకున్న భార్యపై దారుణం.. బలవంతంగా మద్యం తాగించి.. విచక్షణ రహితంగా కొట్టి..
crime news
Follow us on

అనుమానం పెంచుకున్న ఓ భర్త.. తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. బలవంతంగా మద్యం తాగించి.. తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ రప్పించాడు. అంబులెన్స్ రాకతో కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. సదరు మహిళకు ఏమైందని ఆరా తీశారు. ఆమె భర్త తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను తామే శిక్షిస్తామంటూ నిరసన చేశారు. పోలీసులు కలగజేసుకోవడంతో శాంతించారు. హైదరాబాద్(Hyderabad) జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకమ్మబండలో నివాసముండే కర్ణి మమత, బాలకృష్ణ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బాలకృష్ణ ఇద్దరు కుమారులతో కలిసి ఏసీ సర్వీసింగ్‌ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాదిగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మమతపై అనుమానం పెంచుకున్న బాలకృష్ణ.. మమతకు బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె మత్తులో ఉన్న సమయంలో విచక్షణ రహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక మమత శుక్రవారం ఉదయం మృతి చెందింది.

విషయం తెలుసుకున్న ఇద్దరు కుమారులు.. ఈ విషయం బయటకు తెలియనీయకుండా ఉండేందుకు పన్నాగం పన్నారు. ఇంటి తలుపులు వేసి, మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మమత మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించారు. అనుమానం వచ్చిన స్థానికులు మమతకు ఏమైందని ఆరా తీశారు. వారికి ఏదో ఒక సమాధానం చెప్పేందుకు బాలకృష్ణ ప్రయత్నించాడు. అతని వ్యవహారం అనుమానస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానికుల సమచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు.. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఆమె భర్తే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకుని.. బాలకృష్ణతో పాటు కుమారులు లక్ష్మణ్, శంకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నిందితులను తామే శిక్షిస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో నిరసనకారులు శాంతించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Prashant Kishor: మోడీని ఎలా ఓడించాలో ప్రజెంటేషన్ ఇవ్వలేదు.. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

GT vs RCB Score: ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌.. గుజరాత్‌ టార్గెట్‌ 171 పరుగులు..