Hyderabad: అయ్యబాబోయ్! డెవిల్ ఫిష్.. చాలా డేంజర్.!! వర్షానికి ఓ ఇంట్లో ప్రత్యక్షం..

|

Sep 13, 2022 | 6:42 PM

సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి..

Hyderabad: అయ్యబాబోయ్! డెవిల్ ఫిష్.. చాలా డేంజర్.!! వర్షానికి ఓ ఇంట్లో ప్రత్యక్షం..
Devil Fish
Follow us on

సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి.. కొన్ని చేపలు వారి కడుపు నింపుకోవడానికి ఉపయోగపడితే.. మరికొన్ని కాసులు కురిపిస్తాయి. అయితే, ఇక్కడొక చేప.. హైదరాబాద్‌లోని వరద నీటిలో కనిపించింది. దాన్ని చూశాక అందరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా భాగ్యనగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే రామాంతపూర్ సాయి కృష్ణానగర్‌లో అరుదైన చేప ప్రత్యక్షమైంది. అది అరుదుగా కనిపించే డెవిల్ చేప అని స్థానికులు అంటున్నారు. దాన్ని చూడడానికి జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ అరుదైన చేప రాష్ట్రంలోని జలవనరులలో కూడా పలు సందర్భాల్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ చేప.. ఇతర రకాల చేపలపై దాడి చేసి.. దాని ఆకలిని తీర్చుకుంటుందట. సముద్రంలో కనిపించే ఈ చేపలు.. ఇప్పుడు కాలవలు, చెరువుల్లో కనిపిస్తున్నాయని.. ఈ డెవిల్ ఫిష్‌ను అస్సలు బ్రతకనీయకూడదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.