Hyderabad: చట్నీ ఎక్కువైందంటూ భార్యతో భర్త గొడవ.. కట్ చేస్తే, మరుసటి రోజు ఏం జరిగిందంటే..

|

Jan 09, 2024 | 5:06 PM

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు సహజం.. ఇలాంటి విషయాలను మరిచి.. కొందరు బలవన్మరణానికి పాల్పడి.. కుటుంబాల్లో తీవ్రశోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా.. భార్యాభర్తల మధ్య చట్నీ విషయంలో తలెత్తిన గొడవ.. తీవ్రమై.. ఒకరి ప్రాణాన్ని బలిగొంది.. ఈ ఘటనలో భార్య బలవన్మరణానికి పాల్పడింది.

Hyderabad: చట్నీ ఎక్కువైందంటూ భార్యతో భర్త గొడవ.. కట్ చేస్తే, మరుసటి రోజు ఏం జరిగిందంటే..
Crime News
Follow us on

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు సహజం.. ఇలాంటి విషయాలను మరిచి.. కొందరు బలవన్మరణానికి పాల్పడి.. కుటుంబాల్లో తీవ్రశోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా.. భార్యాభర్తల మధ్య చట్నీ విషయంలో తలెత్తిన గొడవ.. తీవ్రమై.. ఒకరి ప్రాణాన్ని బలిగొంది.. ఈ ఘటనలో భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన (25).. ఇద్దరూ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చందన ఓ జ్యూవెలరీ షాపులో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవజరిగింది. అనంతరం సోమవారం ఉదయం రమణ తన పనికి వెళ్లగా భార్య పలుమార్లు వీడియో కాల్స్‌ చేసింది. రమణ స్పందించకపోవడంతో ఫోన్‌ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ చందన పేర్కొని.. తాను చనిపోతున్నానంటూ చెప్పి ఫోన్‌ పెట్టేసింది.

అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్‌ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలంటూ చెప్పాడు.. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే ఆమె చనిపోయి ఉంది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త రమణను అదుపులోకి విచారిస్తున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..