Hyderabad: ఇంట్లో పెట్స్‌ని పెంచేవాళ్లు చూడాల్సిన న్యూస్‌ ఇది.. దెబ్బకు మైండ్ బ్లాంకే!

|

May 16, 2024 | 11:18 AM

ఇంట్లో పెట్స్‌ని పెంచే వాళ్లు తప్పకుండా చూడాల్సిన న్యూస్‌ ఇది.. ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునేవాళ్లు..! పెంపుడు కుక్కలు పక్కింటివాళ్లతో ఎలాంటి గొడవలు తెచ్చాయో గతంలోనూ చాలా చూసాం. కానీ ఇప్పుడు జరిగిన గొడవ, ఆ దాడి దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయ్‌. అదేంటంటే.?

Hyderabad: ఇంట్లో పెట్స్‌ని పెంచేవాళ్లు చూడాల్సిన న్యూస్‌ ఇది.. దెబ్బకు మైండ్ బ్లాంకే!
Dogs
Follow us on

ఇంట్లో పెట్స్‌ని పెంచే వాళ్లు తప్పకుండా చూడాల్సిన న్యూస్‌ ఇది.. ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునేవాళ్లు..! పెంపుడు కుక్కలు పక్కింటివాళ్లతో ఎలాంటి గొడవలు తెచ్చాయో గతంలోనూ చాలా చూసాం. కానీ ఇప్పుడు జరిగిన గొడవ, ఆ దాడి దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయ్‌. పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం చివరికి దాడులు చేసుకొనే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వాళ్ల కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగలడంతో వెటర్నరీ హాస్పిటల్‌లో చికిత్స చేస్తున్నారు. హైదరాబాద్‌ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్‌లో జరిగిందీ ఘటన. మధు, శ్రీనాథ్‌ల కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. ఈనెల 8న వాళ్ల కుక్క ఎదురింటి ఆవరణలోకి వెళ్లి ధనుంజయ్‌ను కరిచింది. కావాలనే కుక్కను తనపైకి ఉసికొల్పారంటూ ధనుంజయ్‌ వారితో గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు PSలో కంప్లైంట్‌ చేసుకున్నారు.

ఈ గొడవ తర్వాత కూడా కొనసాగింది. తాను కంప్లైంట్‌ చేసినా పోలీసులు ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదని రగిలిపోయిన ధనుంజయ్‌. దాడి చేసేందుకు టైమ్‌ కోసం ఎదురు చూశాడు. మంగళవారం మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్‌కు బయటకు వచ్చినప్పుడు ఎటాక్ చేశాడు. తనతోపాటు నలుగురిని వెంట పెట్టుకుని వచ్చి ధనుంజయ్‌ ఎటాక్ చేశాడు. శ్రీనాథ్‌, అతని కుటుంబ సభ్యులు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మధు సోదరుడు శ్రీనాథ్‌తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి మరదలు స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో మధురానగర్‌ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.