Hyderabad: పాతబస్తీలో పెరుగుతున్న వైట్నర్ కల్చర్.. మత్తులో జోగుతున్న చిన్నారులు..

Hyderabad Old City: పాతబస్తీలో ఓ వైపు ఆధ్యాత్మిక మాసం రంజాన్‌ సందడి. మరోవైపు ఇతరజిల్లాల నుంచి భిక్షాటనకు వచ్చే వారితో రద్దీ. ఇంకోవైపు చిన్నారులు మత్తులో తూగుతున్న దృశ్యాలు అందర్నీ కలవరపెడుతున్నాయి.

Hyderabad: పాతబస్తీలో పెరుగుతున్న వైట్నర్ కల్చర్.. మత్తులో జోగుతున్న చిన్నారులు..
Drugs
Follow us

|

Updated on: Apr 12, 2022 | 7:43 AM

Hyderabad Old City: పాతబస్తీలో ఓ వైపు ఆధ్యాత్మిక మాసం రంజాన్‌ సందడి. మరోవైపు ఇతరజిల్లాల నుంచి భిక్షాటనకు వచ్చే వారితో రద్దీ. ఇంకోవైపు చిన్నారులు మత్తులో తూగుతున్న దృశ్యాలు అందర్నీ కలవరపెడుతున్నాయి. ఇంతకీ ఓల్డ్‌సిటీలో ఏం జరుగుతోందన్న ప్రశ్న అందరినుంచి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ పాతబస్తీ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. రంజాన్‌లో ఈ రద్దీ మరీ ఎక్కువే. ఇరుకైన గల్లీలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, చార్మినార్‌ పరిసరాల్లో చైల్డ్‌ లేబర్‌ మత్తుకి బానిసలు అవుతున్నారు. సొల్యూషన్‌ వైట్నర్‌ వంటి పదార్థాలకు మైనర్‌ బాలురు అలవాటు పడుతున్నారు. రంజాన్‌ మాసం కావడంతో రోజంతా కష్టపడి వంద నుంచి 150 రూపాయల వరకు భిక్షాటన చేసుకుంటున్నారు చిన్నారులు. సాయంత్రం కాస్త చీకటిపడగానే వంద రూపాయలతో మత్తు పదార్థాలు (Whitener Drug addiction) కొని ఈ చిన్నారులు మత్తులో తూగుతున్న దృశ్యాలు పాతబస్తీలో పరిపాటిగా మారిపోయింది. పాతబస్తీతో పాటు నగరంలోని కాస్త రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ వైట్నర్ల హడావుడి ఎక్కువైపోయింది. అనేకసార్లు పోలీసులు..ఈ చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం సమీపంలో గతంలో ఓ వ్యక్తి ఏకంగా వైట్నర్ మత్తులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం పాతబస్తీతోపాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నారులు వైట్నర్‌లకు అలవాటు పడటం ఆందోలన కలిగిస్తోంది. వైట్నర్‌ మత్తుకు కాసేపు చిన్నారులు మత్తులో ఆనంద కలిగించినా…ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఎక్కువ అంటున్నారు సైకాలజిస్ట్‌లు.

చైల్డ్‌లేబర్‌ వైట్నర్‌కి అలవాటుపడుతున్నారని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. అనేక సందర్భాల్లో తాము దాడులు చేసి అధికారులకు పట్టించామంటున్నారు. పోలీసుల సహకారంతో మత్తుకు బానిసలైన చిన్నారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైట్నర్లు రెచ్చిపోతున్నారని బాలల హక్కుల నేతలు విమర్శిస్తున్నారు.

Also Read:

Warangal: టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రూ.40 కోట్ల ఆస్తి..!

PM Narendra Modi: భారత్‌ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్నే కోరుకుంటుంది.. పాక్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు