Hyderabad: ప్రజలకు హై అలెర్ట్.. ఈ నంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దు

|

May 09, 2023 | 9:10 AM

వాట్సాప్ ద్వారా సైబర్ ఎటాక్ షురూ అయ్యింది. ఇతర దేశాల నెంబర్స్‌ నుంచి వాట్సాప్ కాల్స్, మెసేజీలు కుప్పలు, తెప్పులకుగా వస్తున్నాయి. రిపీటెడ్‌ కాల్స్‌ చేస్తూ విసిగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తెలియని విదేశీ కోడ్‌లతో ఫోన్లు వస్తే... అస్సలు లిఫ్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Hyderabad: ప్రజలకు హై అలెర్ట్.. ఈ నంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దు
Whatsapp Scam Alert
Follow us on

ప్రజలకు అలెర్ట్. మాయగాళ్లు కొత్త స్కెచ్‌తో రంగంలోకి దిగారు.  వాట్సాప్‌‌ను అస్త్రంగా మలుచుకున్నారు. గత 10 రోజులుగా ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి చాలామందికి మెసేజ్‌లు, కాల్స్‌ వస్తున్నాయి. లోన్స్, జాబ్ అవకాశాలు, లాటరీలు, టాస్కుల పేరుతో ట్రాప్ చేస్తున్నారు. ఇథియోపియా, మలేషియా, వియత్నాం వంటి దేశాల  ఐఎస్‌డీ కోడ్స్‌తో ఈ కాల్స్ వస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే, కంత్రీగాళ్ల చేతికి తమ నంబర్లు ఎలా చిక్కాయని వాట్సాప్‌ యూజర్లు నెత్తి బాదుకుంటున్నారు. రిపీటెడ్‌ కాల్స్‌ వస్తున్నాయని విసిగిపోతున్నారు. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి అమ్మాయిల పేరుతో కూడా మెసేజ్‌లు, వీడియో కాల్స్ వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఇది ఓ పెద్ద స్కామ్‌ అని.. విదేశీ కోడ్‌లతో ఫోన్లు వస్తే.. రెస్పాండ్ కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. వాట్సాప్‌ VoIP(Voice over Internet Protocol) నెట్‌వర్క్‌ ద్వారా వర్క్ అవుతుంది.  ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం డేటా ద్వారా కాల్స్ చేయవచ్చు. మెసేజీలు పెట్టవచ్చు.  అందుకే కేటుగాళ్లు ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా మోసాలకు తెగబడుతున్నారు. విదేశీ కోడ్‌లతో ఫోన్ వచ్చినంత మాత్రమే.. అది ఇంటర్నేషనల్ కాల్ అనడానికి లేదు. ఇటీవల పలు ఏజెన్సీలు వాట్సాప్‌ కాల్‌, మెసేజ్‌ల కోసం మన సిటీల్లో ఇంటర్నేషనల్ నంబర్స్ విక్రయిస్తున్నాయి. అందుకే తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో రోజుకు లక్షల్లో ఈ కాల్స్ వస్తున్నాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఇలాంటి కాల్స్‌ను వేలాదిగా గమనించారు సైబర్ పోలీసులు. వస్తున్న కాల్స్‌లో అధికంగా ఆడియో కాల్స్ ఉంటున్నాయి. చాలా వరకూ మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి. కొన్ని అమ్మాయిల ఫోటోలతో వీడియో కాల్స్ ఉంటున్నాయి. వీటిల్లో ఏ కాల్స్ లిఫ్ట్ చేసినా అంతిమంగా నష్టపోవడం ఖాయం. మాటల్లోనే పెడతారా.. ముంచేస్తారో తెలీదు. అకౌంట్‌ లూటీకి దారితీసే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడియోకాల్స్ కారణంగా బ్లాక్‌మెయిల్ వరకూ వ్యవహారం వెళ్లొచ్చు. సో.. ఎట్టిపరిస్థితుల్లో విదేశీ స్కామ్ కాల్స్ లిఫ్ట్ చెయ్యొద్దు గాక చెయ్యొద్దు. కాగా స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు త్వరలో వాట్సాప్‌లో సైతం ట్రూకాలర్‌ సేవలను తీసుకురానున్నట్లు ట్రూకాలర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలన్‌ మమెది వెల్లడించారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం