తెలంగాణలో ఆగని వాటర్ వార్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్స్ మధ్య మాటల యుద్ధం.!

|

Feb 17, 2024 | 6:59 PM

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరిగేషన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్‌పేపర్‌తో.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. తప్పు మీదంటే మీదంటూ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం వాదోపవాదానికి దిగారు.

తెలంగాణలో ఆగని వాటర్ వార్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్స్ మధ్య మాటల యుద్ధం.!
Weekend Hour
Follow us on

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరిగేషన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్‌పేపర్‌తో.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. తప్పు మీదంటే మీదంటూ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం వాదోపవాదానికి దిగారు. దీంతో, అసలింతకూ ప్రాజెక్టుల విషయంలో తప్పెవరిది? గోబెల్స్‌ ప్రచారమెవరిది? అసలు నిజమేంటి? అనే చర్చ తెరమీదకు వచ్చింది.

తెలంగాణలో వాటర్‌ వార్‌ పీక్స్‌కు చేరుకుంది. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ దద్ధరిల్లింది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభలో వైట్‌పేపర్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పైగా తమపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం ఆయకట్టును తక్కువచేసి చూపుతున్నారంటూ.. ప్రభుత్వానికి కౌంటర్‌ ఇచ్చారు హరీశ్‌రావు. కాళేశ్వరం పరిధిలో 20లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందనీ.. ప్రాజెక్టులపై ప్రజంటేషన్‌ తప్ప ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ లేదనీ చెప్పారు. మేడిగడ్డ కుంగడం దురదృష్టకరమన్న హరీష్‌.. వానాకాలం వచ్చేలోపు దాన్ని రిపేర్‌ చేయించాలన్నారు. తమపై కోపంతో బ్యారేజ్‌ రిపేర్‌ చేయించకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు హరీశ్‌.

బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్‌. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదన్న సీఎం… రాష్ట్రానికి అదొక కళంకంలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. చేసిన తప్పులు ఒప్పుకోకుండా… ఎదురుదాడి చేయడం కరెక్టుకాదన్నారు రేవంత్‌. సీఎం వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటరిచ్చారు హరీశ్‌. ఏ విచారణకైనా సిద్ధమని మరోసారి ప్రకటించారు. మరి, సాగునీటిపై ముదిరిన ఈ సమరం.. ఈ అసెంబ్లీ సెషన్‌తో ముగుస్తుందా? కంటిన్యూ అవుతుందా చూడాలి.