Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు సంబంధించి సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు మణికొండ కల్వర్టు వద్ద పీఎస్సీ పైపు లైన్ దెబ్బతినడంతో భారీ లీకేజీ ఏర్పడిందని పేర్కొంది.. ఈ లీకేజీని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు చేపట్టినట్లు వెల్లడించింది.

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
Drinking Water Supply

Updated on: Oct 06, 2025 | 9:17 PM

Hyderabad drinking water supply alert: హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి జలమండలి పలు కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు సంబంధించి సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు మణికొండ కల్వర్టు వద్ద పీఎస్సీ పైపు లైన్ దెబ్బతినడంతో భారీ లీకేజీ ఏర్పడిందని పేర్కొంది.. ఈ లీకేజీని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పనులు చేపట్టినట్లు వెల్లడించింది.

ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు తేది.06.10.2025, సోమవారం రాత్రి 10 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా తేది.07.10.2025, మంగళవారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌మ్మతు ప‌నులు చేప‌ట్టనున్నారు.

కావున ఈ 10 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుందని జలమండలి ప్రకటనలో తెలిపింది.

నీటి సరఫరాకు అంత‌రాయం ఏర్పడే ప్రాంతాలు:

మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, షేక్ పేట్, హకీంపేట్, తౌలిచౌకి, కాకతీయ నగర్ లోని కొన్ని ప్రాంతాలు, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, కార్వాన్, ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

కాబ‌ట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..