AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices Today: పండుగ క్రమంలో సామాన్యులకు బిగ్ రిలీఫ్.. పడిపోయిన కూరగాయల ధరలు.. రేట్లు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లోని రైతు బజార్లలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉల్లి, టమాటాతో పాటు పలు కూరగాయల ధరలు దిగొచ్చాయి. పండుగ క్రమంలో ధరలు తగ్గడం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఉల్లిపాయలతో పాటు టమాటా ధరలు తగ్గాయి. ఇంకా మిగతా కూరగాయల ధరలు కూడా కొన్ని తగ్గాయి.

Vegetable Prices Today: పండుగ క్రమంలో సామాన్యులకు బిగ్ రిలీఫ్.. పడిపోయిన కూరగాయల ధరలు.. రేట్లు ఇవే..
Kukatpally Rythu Bazaar Vegetable Prices
Venkatrao Lella
|

Updated on: Oct 27, 2026 | 1:31 PM

Share

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు శుభవార్త. కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. దీపావళి పండుగ వేళ ధరలు దిగొస్తుండటంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తోంది. పండుగ సందర్భంగా ఇంట్లో రకరకాల వంటకాలు వండుతూ ఉంటారు. ఈ సమయంలో నిత్యావసర సరుకులు, కూరగాయల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ధరలు తగ్గడం కాస్త ఊరట లభించింది. మొన్నటివరకు కిలో ఉల్లి రూ.80 వరకు చేరుకోగా.. అంతకముందు టమాటా ధరలు కూడా పెరిగాయి. కిలో టమాటా రూ.50 వరకు చేరుకుంది. ఇప్పుడు ఈ రెండిటి ధరలతో పాాటు పలు కూరగాయల ధరలు తగ్గాయి. అక్టోబర్ 27వ తేదీన మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

కూకట్‌పల్లి మోడ్రన్ రైతు బజార్‌లో ఈ రోజు కూరగాయల ధరలు(కిలోల్లో)

– టమాటా రూ.29 -వంకాయ రూ.18 -బెండకాయ రూ.35 -పచ్చిమిర్చి రూ.45 -బజ్జీ మిర్చి రూ.45 – కాకరకాయ రూ.31 -బీరకాయ రూ.35 – క్యాబేజీ రూ.13 -చిక్కుడు రూ.50 – క్యారెట్ రూ.45 – కాలీఫ్లవర్ రూ.30 – దొండకాయ రూ.18 – చిక్కుడుకాయ రూ.55 – గోరుచిక్కుడు రూ.35 – బీట్‌రూట్ రూ.33 – క్యాప్సికమ్ రూ.37 – ఆలుగడ్డ రూ.23 -స్థానిక కీరదోస రూ.23 – ఇటాలియన్ కీరదోస రూ.35 – దోసకాయ రూ.23 – సొరకాయ రూ.20 – పొట్లకాయ రూ.24 – కందగడ్డ రూ.28 – ఉల్లికాడలు రూ.55 – ఎండుఉల్లిపాయలు రూ.40 – పచ్చి మామిడి రూ.15–20 – అరటికాయ రూ.9–10 – చామగడ్డ రూ.40 – ముల్లంగి ఒక్కటి రూ.6–8 – చిలగడదుంప రూ.40 – గుమ్మడికాయ రూ.40 – నిమ్మకాయలు డజను రూ.50–60 – మునగకాయ ఒక్కటి రూ.10–12 – బొప్పాయి రూ.50 – పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ.50 – ఎండుమిర్చి రూ.280 – పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260 – చింతపండు రూ.160, ఎర్రమిర్చి రూ.80, ఉసిరికాయ రూ.80, కరివేపాకు రూ.60, వేరుశనగలు రూ.60, లోబియా రూ.40

గుంటూరు రైలు బజార్లలో ఇలా..

ఇక గుంటూరులో కిలో టమాటా రూ.34, వంగ రూ.20, బెండ రూ.13, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.32, బీర రూ.45, క్యాలీఫ్లవర్ రూ.40, క్యాబేజీ రూ.25, క్యారెట్ రూ.42, దొండ రూ.18, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.35, గోరుచిక్కుళ్లు రూ.29, దోస రూ.25, సొర రూ.14, పొట్ల రూ.18, అరటికాయ రూ.10, పెద్ద చిక్కుళ్లు రూ.66, చామదుంప రూ.32, మునగ రూ.10, బీట్ రూట్ రూ.34, కీరదోస రూ.35, బీన్స్ రూ.75, క్యాప్చికం రూ.69 పలుకుతోంది.

Follow Us