Union Minister Kishan Reddy: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్!.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

|

Feb 14, 2021 | 2:51 PM

Union Minister Kishan Reddy: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ..

Union Minister Kishan Reddy: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్!.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Follow us on

Union Minister Kishan Reddy: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. శనివారం నాడు లోక్‌సభలో జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రసంగించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ను యూటీ చేసినా చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తాాజాగా హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి స్పందించారు. యూటీ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేలోపే అసదుద్దీన్ లోక్‌సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్‌లో‌ ఉన్న హైదరాబాద్‌‌ను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు.

Also read:

Karnan Movie Update: ‘కర్ణన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. సీరియస్ లుక్‏తో విడుదల తేదీని ప్రకటించిన స్టార్ హీరో..

Ind vs Eng: రెండో రోజు టీమిండియా బౌలర్ల దూకుడు.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..