Kishan Reddy: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన..

|

Feb 07, 2024 | 8:40 PM

గేట్‌ ఆఫ్‌ సౌతిండియా.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఐకాన్‌గా మారబోబోతంది. కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌ను అంతర్జాతీయ విమానశ్రయ తరహాలో అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ వందే భారత్ రైల్ ను ప్రారంభించడంతో పాటు రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

Kishan Reddy: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన..
Kishan Reddy
Follow us on

హైదరాబాద్, ఫిబ్రవరి 07: గేట్‌ ఆఫ్‌ సౌతిండియా.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఐకాన్‌గా మారబోబోతంది. కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌ను అంతర్జాతీయ విమానశ్రయ తరహాలో అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ వందే భారత్ రైల్ ను ప్రారంభించడంతో పాటు రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సందర్శించారు. సంబంధిత అధికారులతో కలిసి మల్లీ లెవల్‌ పార్కింగ్‌, విశ్రాంతి గదులు, రూఫ్‌ టాప్‌ రైల్వే ప్లాట్‌ఫామ్‌ పనులను పరిశీలించారు.

ప్రయాణీకులు ఇబ్బంది కలుగకుండా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు కిషన్‌ రెడ్డి. రైల్వేస్టేషన్‌, మెట్రో రైల్‌, ఆర్టీసీ బస్సులకు అనుసంధానం చేస్తూ చేపట్టిన ఆధునీకరణ ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండబోతుందన్నని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి మోదీ పాలనలోనే సాధ్యమైందన్నారు కిషన్‌ రెడ్డి. సికింద్రాబాద్‌ రైల్వేజంక్షన్‌ అధునీకరణ సహా కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు కేటాయించిందన్నారు.

చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని మోదీ ఈ నెలలోనే జాతికి అంకితం చేస్తారన్నారు కిషన్‌రెడ్డి.. అలాగే కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని తెలిపారు. ప్రధాని మోదీ వచ్చాకే తెలంగాణలో రైల్వే అభివృద్ధి జరుగుతుందని వివరించారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. అనుకున్నట్టుగా 2025 కల్లా పనులు పూర్తవుతాయన్నారు. 2025లో ప్రధాని మోదీ చేతుల మీదుగానే సికింద్రాబాద్‌ అధునాతన రైల్వే స్టేషన్‌ జాతికి అంకితం చేయడం జరుగుతుందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..