భాగ్యనగర వాసులకు మరో 2 అర్బన్ ఫారెస్ట్ పార్కులు!

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 6:23 AM

జంటనగర వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడ‌లో ఆరోగ్య వ‌నం, మేడిప‌ల్లిలో జ‌టాయువు అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను అట‌వీ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి ఇంద్ర‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ..ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులు దోహదం చేస్తాయన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది. […]

భాగ్యనగర వాసులకు మరో 2 అర్బన్ ఫారెస్ట్ పార్కులు!
Follow us on

జంటనగర వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడ‌లో ఆరోగ్య వ‌నం, మేడిప‌ల్లిలో జ‌టాయువు అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను అట‌వీ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి ఇంద్ర‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ..ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కులు దోహదం చేస్తాయన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు న‌లువైపులా ‘అర్బన్ లంగ్ స్పేస్’ పేరుతో రిజర్వు ఫారెస్టులను అభివృద్ధి చేస్తుంది. పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా పార్కుల్లో అదనపు హంగులు సమకూరుస్తున్నామ‌ని తెలిపారు. పార్క్ లు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా స్థానికులు కూడా తోడ్పాటునందించాల‌ని కోరారు. తెలంగాణ ప్ర‌భుత్వం అడవుల‌ను పెంచ‌డం, అట‌వీ భూముల ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేస్తుంద‌న్నారు. హ‌రిత‌హ‌రం కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటుతున్నామ‌ని తెలిపారు.