Drink and Drive : ఊదమంటే.. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరారయిన మందు బాబులు​​​​​​

|

Sep 19, 2021 | 1:48 PM

హైదరాబాద్​ కొండాపూర్​లో ఇద్దరు వ్యక్తులు బైక్​ మీద వెళ్తున్నారు. వారిని పోలీసులు ఆపారు. శ్వాస పరీక్ష చేసేందుకు నోటి దగ్గర బ్రీత్‌ ఎనలైజర్‌ పెట్టారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

Drink and Drive : ఊదమంటే.. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరారయిన మందు బాబులు​​​​​​
Drunk And Drive
Follow us on

మందుతాగుతారు… యాక్సిడెంట్స్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ తమ జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు కొందరు మందుబాబులు. ఇలాంటివారి బెండు తీసేందుకు రెగ్యులర్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే కొందరు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారు. లా పాయింట్లు మాట్లాడతారు. రూల్స్ గురించి చెబుతారు. పోలీసులను ముప్పు తిప్పలు పెడతారు. ఇవన్నీ పోలీసులకు రెగ్యులర్ గా ఎదురయ్యే అనుభవాలే. తాజాగా కొండాపూర్ లో శ్వాస పరీక్ష చేసేందుకు నోటి దగ్గర పెట్టిన బ్రీత్‌ ఎనలైజర్‌ మెషీన్ పోలీసుల చేతుల్లోంచి లాక్కొని ఉడాయించారు ఇద్దరు మందుబాబులు.

కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌ సమీపాన శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాత్రి 11.45 సమయంలో మియాపూర్‌ వైపు నుంచి బైక్ మీద వస్తోన్న ఇద్దరిని వారు ఆపారు. బైకు నడుపుతున్న వ్యక్తికి శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు హోంగార్డు తన చేతిలో ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌ను యువకుడి నోటికి దగ్గరలో పెట్టాడు. ఇంతలో సదరు యువకుడు హోంగార్డు చేతిలో ఉన్న మెషీన్ లాక్కొని వేగంగా బైకు మీద దూసుకెళ్లి మాయమయ్యారు. అలెర్టయిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కంప్లైంట్ అందుకున్న మాదాపూర్‌ పోలీసులు ఆకతాయిలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Also Read: ఫుల్ స్వింగ్‌లో వైసీపీ.. అక్కడ క్లీన్ స్వీప్.. నారావారిపల్లిలో సైతం టీడీపీ ఓటమి

మధ్యాహ్నం 2 గంటలకు గంగమ్మ ఒడికి చేరనున్న ఖైరాతాబాద్ గణేశుడు