TSRTC Bus Pass: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌..!

|

Nov 03, 2021 | 9:10 AM

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తనదైన మార్క్ చూపిస్తూనే ఉన్నారు.

TSRTC Bus Pass: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌..!
Tsrtc Md
Follow us on

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తనదైన మార్క్ చూపిస్తూనే ఉన్నారు. ఆర్థిక కుదేలైన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కీలక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయాణికుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తు్న్నారు. ఇదే క్రమంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు సజ్జనార్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకువచ్చారు.

టీ-24 (ట్రావెల్‌ 24 అవర్స్‌) పేరిట రూ.100కే ఒకరోజు ప్రయాణం పేరుతో కొత్త బస్‌పాస్ జారీ చేయనున్నట్టు ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. జంటనగరాల పరిధిలో ఒక రోజంతా ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. పెరిగిన పెట్రోలు ధరలతో సతమతమవుతున్న ప్రజలు అత్యంత చౌకలో, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. నగరవాసులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థకు ఊతం ఇవ్వాలని ఆయన కోరారు.

మరోవైపు, ఆర్టీసీ బస్సులతో పాటు సంబంధిత ప్రాగంణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం కార్యక్రమాలను విధిగా పాటించాలని సజ్జనార్ తెలిపారు. బస్సులోకానీ, బస్‌స్టేషన్‌ ప్రాంగణంలోకానీ గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటివి వాడకూడదని ఎండీ సజ్జనార్‌ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్‌ మేనేజర్లు, డివిజినల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. కొందరు డ్రైవర్లు, ప్రయాణికులు పాన్‌, గుట్కా, పాన్‌మసాలా వంటివి నమిలి బస్సులో, బయట ఉమ్మడం సరైంది కాదని, ఇది సంస్కారవంతులు చేసే పనికాదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ఆర్టీసీ సిబ్బందిపైన కూడా చర్యలు ఉంటాయని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also….  Google Chrome: ఇంటర్నెట్ వినియోగదారులకు గూగుల్ కీలక హెచ్చరిక.. అలా చేయకుంటే ఇక అంతే సంగతులు!

Good Luck Sakhi : కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడో తెలుసా..