AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇకపై రాత్రంతా అందుబాటులోకి సర్సీసులు

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) మరో శుభవార్త చెప్పింది. వివిధ పనుల నిమిత్తం రాత్రి సమయాల్లో నగరానికి చేరుకునే వారు.. గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాత్రి సమయాల్లోనూ బస్సులు నడపాలని...

TSRTC: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇకపై రాత్రంతా అందుబాటులోకి సర్సీసులు
Tsrtc
Ganesh Mudavath
|

Updated on: May 26, 2022 | 5:50 PM

Share

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) మరో శుభవార్త చెప్పింది. వివిధ పనుల నిమిత్తం రాత్రి సమయాల్లో నగరానికి చేరుకునే వారు.. గమ్యస్థానాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాత్రి సమయాల్లోనూ బస్సులు నడపాలని నిర్ణయించింది. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్లవారు జామున 5 గంట‌ల వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులో ఉండ‌నున్నాయి. దేశంలోని మహానగరాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న మహానగరాల్లో హైదరాబాద్(Hyderabad) ఒకటి. చాలా అంశాల్లో మిగిలిన మహానగరాలకు తీసిపోని రీతిలో ఉంది. మహానగరం ట్యాగ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ లో రాత్రి వేళలో ప్రజా రవాణా విషయంలో ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇంత పెద్ద సిటీలో అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు పరిమిత సంఖ్యలో బస్సుల్ని తిప్పితే లాభం కలుగుతుందని భావించిన ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నైట్ రైడర్స్ పేరుతో ఆర్టీసీ బస్సుల్ని అర్థరాత్రి దాటిన తర్వాత తిప్పే ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు పడింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అర్థరాత్రి 12.15 గంటలకు బయలుదేరు ఆర్టీసీ బస్సు పటాన్ చెరు వరకు వెళుతుంది. ఈ రూట్ లు పలు ప్రత్యేక ట్రిప్పుల్ని తిప్పుతారు. దీనికి వచ్చే ఆదరణను చూసిన తర్వాత మిగిలిన రద్దీ రూట్లలో అర్థరాత్రి వేళ బస్సుల్ని తిప్పాలని భావిస్తోంది. సికింద్రాబాద్ – పటాన్ చెరు, పటాన్ చెరు – సికింద్రాబాద్ సికింద్రాబాద్ – చార్మినార్, చార్మినార్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – సీబీఎస్, సీబీఎస్ – సికింద్రాబాద్ మధ్య ట్రిప్పులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!