కేటీఆర్‌కు సూపర్ పంచ్ ఇచ్చిన కవిత.. ఇంట్రెస్టింగ్‌గా అన్నాచెల్లెళ్ల సంభాషణ

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌‌లో యాక్టీవ్‌గా ఉంటారు. అన్నా సహాయమంటే.. వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచిస్తారు. నెటిజన్స్‌ అడిగిన వెరైటీ ప్రశ్నలకు కూడా పంచ్‌లు వేస్తూ..

కేటీఆర్‌కు సూపర్ పంచ్ ఇచ్చిన కవిత.. ఇంట్రెస్టింగ్‌గా అన్నాచెల్లెళ్ల సంభాషణ
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 12:54 PM

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌‌లో యాక్టీవ్‌గా ఉంటారు. అన్నా సహాయమంటే.. వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచిస్తారు. నెటిజన్స్‌ అడిగిన వెరైటీ ప్రశ్నలకు కూడా పంచ్‌లు వేస్తూ ఉంటారు. ఇలా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ ఓ వెరైటీ సమాధానమిచ్చారు. అయితే ఇందులో కల్వకుంట్ల కవిత ఇవ్వాల్వ్ అయి.. ఆసక్తి రేకెత్తించే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ హ‌ల్‌చల్ చేస్తోంది. దీంతో ఒకేసారి రీట్వీట్లు, లైకులతో హోరెత్తిపోతోంది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్.

వివరాల్లోకి వెళ్తే.. ‘ఏప్రిల్ 20 తర్వాతైనా..హెయిర్ కటింగ్ తెరిచే సూచనలు ఉన్నాయా? లేకపోతే.. తన భార్యే హెయిర్ కట్‌ చేస్తానని అంటోందంటూ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ‘టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ హెయిర్ కట్‌ చేసింది. అలాంటిప్పుడు నీవెందుకు చేయించుకోవు’? అంటూ ఫన్నీగా జావాబిచ్చారు.

అంతే.. ‘ఈ సీన్‌లోకి కవిత ఎంటర్ అయ్యారు. ఆమె ఎంటర్ అవడంతోనే సీన్ అంతా రక్తికట్టలేలా తయారైంది. నెటిజన్‌కు కేటీఆర్ ఇచ్చి రిప్లైని చూసిన కవిత.. అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా? అని ట్వీట్ చేశారు. ఇంకేముంది.. ఈ ట్వీట్‌ కాస్తా వైరల్ అయ్యింది. అన్నాచెల్లెళ్ల సంభాషణకు అభిమానులు, టీఆర్‌ఎస్ కార్టీ కార్యకర్తలు ఫిదా అయి’.. కామెంట్స్ చేస్తున్నారు.

Read More:  

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు