Kamakshi Bhaskarla: పొలిమేర 2 హీరోయిన్‏కు అత్యున్నత పురస్కారం.. కెరీర్ మొదట్లోనే ఇలా..

మరో తెలుగమ్మాయి కెరీర్ ప్రారంభంలోనే తన నటనకు అత్యున్నత పురస్కారం అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కామాక్షి భాస్కర్ల. మా ఊరి పొలిమేర 2 సినిమాలో ఈ భామ నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. డీగ్లామరస్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమా కామాక్షి నటనకుగానూ తాజాగా 14వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకుంది.

Kamakshi Bhaskarla: పొలిమేర 2 హీరోయిన్‏కు అత్యున్నత పురస్కారం.. కెరీర్ మొదట్లోనే ఇలా..
Kamakshi Bhaskarla
Follow us

|

Updated on: May 02, 2024 | 2:20 PM

ఇప్పుడు తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వైవిధ్యమైన పాత్రలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇప్పటికే బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కథానాయికగా మెప్పించింది. ఇక ఇప్పుడు మరో తెలుగమ్మాయి కెరీర్ ప్రారంభంలోనే తన నటనకు అత్యున్నత పురస్కారం అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కామాక్షి భాస్కర్ల. మా ఊరి పొలిమేర 2 సినిమాలో ఈ భామ నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. డీగ్లామరస్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమా కామాక్షి నటనకుగానూ తాజాగా 14వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకుంది.

పొలిమేర 2 సినిమాలో నటనకుగానూ బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డ్ అందుకుంది. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది కామాక్షి. అలాగే ఈ సినిమా ఫెస్టివల్ స్క్రీనింగ్ లో సెలక్షన్ కావడం గమనార్హం. కామాక్షి రియాక్ట్ అవుతూ.. “మా ఊరి పొలిమేర 2 లోని నా నటనకు ఉత్తమ నటిగా అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. అవార్డులు నటిగా నా బాధ్యతను మరింత పెంచుతాయి. ఈ అవార్డ్ వచ్చిన సందర్భంగా సమహార థియేటరో నాకు నటన నేర్పించిన నా గురువు రత్నశేఖర్, నీజర్ కబి గార్లకు ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసి ఈ అవార్డ్ రావడానికి కారణమైన అందరికి దీనిని అంకితం చేస్తున్నాను” అంటూ తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.