హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ కరోనా పేషెంట్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రాణాలకు తెగించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులపై దేశ వ్యాప్తంగా దాడులు సాగుతున్నాయి. ఏవోవే సాకులతో కొందరు డాక్టర్లను, నర్సులను వేధిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో..

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2020 | 3:00 PM

దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ కరోనా పేషెంట్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రాణాలకు తెగించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులపై దేశ వ్యాప్తంగా దాడులు సాగుతున్నాయి. ఏవోవే సాకులతో కొందరు డాక్టర్లను, నర్సులను వేధిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యుడిపై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కాగా దేశంలో ఒక కరోనా పేషెంటును అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అలాగే గత కొద్ది రోజుల క్రితం తమిళనాడులో వైద్యం అందిస్తోన్న ఓ వైద్యుడిపై.. కరోనా పేషెంట్ ఉమ్మి వేశాడు. దీంతో పోలీసులు అతనిపై హత్యా యత్నం కేసు నమోదు చేశారు.

కాగా ఈ నెల 1వ తేదీన గాంధీ ఆస్పత్రిలో ఒక కరోనా పేషెంట్(56) బాత్రూమ్‌లో జారి పడి మరణించాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి చనిపోయాడని బంధువులు దాడి చేశారు. వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఒకరైన 23 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా ఉంది. డాక్టర్‌పై దాడిని వైద్య సిబ్బంది తీవ్రంగా పరిగణించి కేసు పెట్టింది. పోలీసులు బుధవారం ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు. వారిద్దరికీ జడ్జి.. జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత కరోనా పేషెంటును ఆస్పత్రికి తరలించారు. అతని సోదరుణ్ని గాంధీ ఆస్పత్రిలో ఖైదీల ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుడిపై దాడి చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More:  పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

లక్ష్మీ పార్వతికి సీఎం జగన్ బంపర్ ఆఫర్! ఆ రంగంలో కీలక పదవి?

నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..

‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?