TS Eamcet: తెలంగాణ ఎంసెట్ వాయిదా పడే అవకాశం.! ఆగష్టులో నిర్వహణ.!!

|

May 29, 2021 | 8:35 AM

కరోనా లాక్‌డౌన్, ఇంటర్ పరీక్షలు జరగకపోవడంతో తెలంగాణ ఎంసెట్ పరీక్ష వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..

TS Eamcet: తెలంగాణ ఎంసెట్ వాయిదా పడే అవకాశం.! ఆగష్టులో నిర్వహణ.!!
Follow us on

కరోనా లాక్‌డౌన్, ఇంటర్ పరీక్షలు జరగకపోవడంతో తెలంగాణ ఎంసెట్ పరీక్ష వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఎగ్జామ్స్ జూలై 5 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సి ఉండగా.. ఇంటర్ పరీక్షలను జూలై 15 నుంచి నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు లిఖితపూర్వకంగా చెప్పింది. ఈ నేపధ్యంలో ఇంటర్ పరీక్షలు పూర్తయిన 15 రోజుల తర్వాత.. ఎంసెట్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీన్ని బట్టి ఎంసెట్ ఆగష్టులో జరిగే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎంసెట్‌తో పాటు జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన పీఈసెట్ పరీక్షలు, జూన్ 19-22 వరకు జరిగే పీజీఈసెట్, జూలై 1న నిర్వహించాల్సిన ఈసెట్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

12వ తరగతి పరీక్షలపై కేంద్రం రెండు ప్రతిపాదనలు..

కాగా, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్షలను జూలై 15 నుంచి ఆగష్టు 28 వరకు నిర్వహించాలని భావిస్తోంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు రెండు ప్రతిపాదనలను సూచించింది. మొదటిది ముఖ్యమైన సబ్జెక్ట్‌లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని.. రెండోది అన్నింటికీ పరీక్షలు నిర్వహించి.. పరీక్షా సమయాన్ని మాత్రం 90 నిమిషాలకు తగ్గించాలని తెలిపింది. అన్ని రాష్ట్రాలు రెండో ఆప్షన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!