GHMC Mayor Election: కౌన్‌ బనేగా జీహెచ్ఎంసీ మేయర్‌..? మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ ఎంతుండాలి..?

|

Feb 10, 2021 | 10:06 AM

 ఉత్కంఠ రేపుతున్న ఈ క్వశ్చన్‌కు రేపే ఆన్సర్‌ రాబోతోంది. మరి, రేసులో ఉన్నదెవరు? మేయర్‌ పీఠం దక్కేది ఎవరికి.. అసలు మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే..మ్యాజిక్‌ ఫిగర్‌ ఎంత ? ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయా ? జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గం ఎవరిది?

GHMC Mayor Election: కౌన్‌ బనేగా జీహెచ్ఎంసీ మేయర్‌..? మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ ఎంతుండాలి..?
GHMC Mayor Election
Follow us on

గురువారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎవరో తేలిపోనుంది..150 స్థానాలకు ఎన్నికలు జరిగనా..ఎక్స్‌ అఫీషియోలు 52 మందిని కలిపి మొత్తం 202గా ఉంది..దీంతో ఆ 101 మ్యాజిక్‌ ఫిగర్‌ను ఎవరు చేరుతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..కీలకంగా మారిన ఎక్స్‌ అఫిషియోలు ఎవరికి ఓటు వేస్తారన్నదే ప్రశ్న..?

డిసెంబర్‌ 4వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 150 డివిజన్లలో 56 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది టీఆర్ఎస్. బీజేపీకి 48, ఎంఐఎంకి 44, కాంగ్రెస్‌కు 2 డివిజన్లు దక్కాయి.. 150 కార్పొరేటర్లు మంది కాకుండా… జీహెచ్ఎంసీలో 52 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. దాంతో మొత్తం 202 ఓట్లు ఉంటాయి. అంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 102.ఇప్పుడు ఈ ఎక్స్‌ అఫిషియోలు మద్దతు ఎవరు ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

టీఆర్ఎస్ గెలవాలంటే…

అప్పుడు టీఆర్ఎస్ గెలవాలంటే 102 ఓట్లు కావాల్సిందే. టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌ అఫీషియో ఓట్లు 38 ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు మొత్తం నలుగురు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 17మంది లోకల్‌ ఎమ్మెల్యేలు కలిపి 38 ఓట్లున్నాయి. అంటే వీటిని లెక్కేసుకుంటే 64 డివిజన్లలో గెలిస్తే.. టీఆర్‌ఎస్‌దే మేయర్ పీఠం.

బీజేపీ బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే..

ఇక బీజేపీ బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే… ముగ్గురు ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కిషన్‌ రెడ్డికి గ్రేటర్‌లో ఓటుహక్కు ఉంది. అలానే… గోషామహల్‌ నుంచి ఎమ్మల్యేగా గెలిచిన రాజాసింగ్‌ , ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కమలనాథులకు మూడు ఓట్ల బలం అంది. అంటే… గ్రేటర్‌లో మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే.. బీజేపీ 99 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది.ఇక ఈ విషయమై ఈ రోజు బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ పెట్టనున్నారు బీజీపీ.

అధికంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నది..

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ తర్వాత.. అధికంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నది.. మజ్లిస్‌ పార్టీకే..! ఆ పార్టీకి గ్రేటర్‌లో ఓటుహక్కు కలిగిన ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తంగా మేయర్‌ ఎన్నికలో మజ్లీస్‌ పార్టీకి 10 ఎక్స్‌ అఫీషియో ఉన్నాయి.. కాంగ్రెస్‌ బలాబలాలు చూస్తే.. ఆ పార్టీకి ఒక్కరే ఎంపీ ఉన్నారు. మల్కాజ్‌గిరీ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డికి ఓటు హక్కు ఉంది. దీంతో 101 డివిజన్లలో గెలవాలి. మజ్లిస్‌కు 10 ఎక్స్‌అఫీషియో ఓట్లున్నా.. వారు పోటీచేసిన స్థానాలు తక్కువే కాబట్టి.. మేయర్‌ పీఠం దక్కే అవకాశంలేదు.

మేయర్ రేసులో ఉన్నది ఎవరు..?

మేయర్ ఎన్నికలపై నిర్ణయం మార్చుకుంది బీజేపీ. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు నామినేషన్ ఫైల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక.. టీఆర్ఎస్ నుంచి మేయర్‌ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరం. మేయర్ స్థానం జనరల్ మహిళ కావడంతో టీఆర్‌ఎస్‌ తరఫున మహిళలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. భారతి నగర్ మంచి గెలిచిన సింధు రెడ్డి, ఖైరతాబాద్ నుంచి విజయ రెడ్డిలతో పాటు చింతల విజయశాంతి రెడ్డి, గద్వాల్ విజయలక్ష్మి తో పాటు బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మేయర్‌ సీటు ఎవరనేది రేపు తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి : 

Women Trafficking : ఒక చిన్న అనుమానం.. విదేశాలకు తరలించే ఘరానా గ్యాంగ్ గుట్టు విప్పింది
IPL Title : ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ నుంచి చైనా మొబైల్​ దిగ్గజం తప్పుకుంటే.. పోటో పడుతున్న దేశీ కంపెనీలు ఇవే..