చేప ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం.. క్యూలైన్‌ తోపులాటలో వ్యక్తి మృతి

| Edited By: Venkata Chari

Jun 08, 2024 | 11:03 PM

మృగశిర కార్తె నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప పంపిణీ కార్యక్రమం మొదలైంది. బత్తిని కుటుంబ సభ్యులు జూన్ 8న ఉదయం నుంచి.. చేప ప్రసాదం పంపిణీ షురూ చేశారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలున్న రోగులు తరలివచ్చారు.

చేప ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం.. క్యూలైన్‌ తోపులాటలో వ్యక్తి మృతి
Chepa Mandu Prasadam
Follow us on

మృగశిర కార్తె నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప పంపిణీ కార్యక్రమం మొదలైంది. బత్తిని కుటుంబ సభ్యులు జూన్ 8న ఉదయం నుంచి.. చేప ప్రసాదం పంపిణీ షురూ చేశారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలున్న రోగులు తరలివచ్చారు. అయితే.. చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర విషాదం జరిగింది. చేప ప్రసాదం కోసం జనాలు భారీ ఎత్తున రావటంతో క్యూలైన్‌లలో తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో.. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న.. స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన వాలంటీర్లు.. అతన్ని వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజన్న చనిపోయాడు.

చేప ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికి రద్దీ హెవీగానే ఉంది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం తీసుకోవటం వల్ల ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి స్వాంతన దొరుకుతుందని ప్రజల నమ్మకం. ‘మృగశిర కార్తె’ ప్రారంభం రోజున బత్తిని కుటుంబ సభ్యులు ఈ ప్రసాదాన్ని ప్రతి ఏటా ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. గత 178 సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతుంది. ఈ చేప మందుకు రహస్య సూత్రాన్ని 1845లో ఒక సాధువు తమ పూర్వీకులకు తెలియజేసినట్లు బత్తిని కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..