అలెర్ట్: నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

| Edited By:

Nov 09, 2019 | 7:26 AM

హైదరాబాద్‌ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం నుంచే పోలీసులు టాక్ బండ్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. నేడు అల్లర్లు మరింత ఉధృతం అవనున్న నేపథ్యంలో.. ఎక్కడిక్కడ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మిలియన్ మార్చ్‌కి ప్రతిపక్షాలు, స్టూడెంట్స్ కూడా.. మద్దతు తెలపడంతో.. అల్లర్లు, గొడవలు మరింత కానున్నాయి. దీంతో.. అటువైపు వచ్చే వాహనాలను దారి […]

అలెర్ట్: నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
Follow us on

హైదరాబాద్‌ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం నుంచే పోలీసులు టాక్ బండ్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. నేడు అల్లర్లు మరింత ఉధృతం అవనున్న నేపథ్యంలో.. ఎక్కడిక్కడ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మిలియన్ మార్చ్‌కి ప్రతిపక్షాలు, స్టూడెంట్స్ కూడా.. మద్దతు తెలపడంతో.. అల్లర్లు, గొడవలు మరింత కానున్నాయి. దీంతో.. అటువైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు.

ఏదారి ఎటువైపు..!

  • సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు మళ్లింపు
  • ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ఇందిరాపార్క్‌కు వచ్చే వాహనాలు అశోక్‌నగర్ వైపు మళ్లింపు
  • హిమయత్ నగర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు బషీర్‌బాగ్ వైపు
  • ఓల్డ్ ఎమ్మెల్యే నుంచి వచ్చే వాహనాలు పీవీఆర్ జంక్షన్ వైపు దారి మళ్లింపు
  • ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు ఇందిరా పార్క్ విగ్రహం నుంచి నెక్‌లెస్ రోడ్ వెళ్లాలని సూచనలు
  • ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో పయనించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.