Traffic Diversions at HYD: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..! ఆ రూట్లలో వెళ్లే వాహనాలను వేరే రోడ్లకు మళ్లింపు

|

Jun 22, 2023 | 7:32 AM

తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా 'తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ' కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్‌ నగరంలో..

Traffic Diversions at HYD: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..! ఆ రూట్లలో వెళ్లే వాహనాలను వేరే రోడ్లకు మళ్లింపు
Traffic Restrictions
Follow us on

హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా బుధవారం ‘తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ’ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గురువారం (జూన్‌ 22) ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాఫిక్‌ పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ జి సుధీర్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్యాంక్‌ బండ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. వీవీ విగ్రహం (ఖైరతాబాద్) జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్‌ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ (లోయర్ ట్యాంక్‌బండ్), ట్యాంక్‌బండ్, లిబర్టీ, కర్బలా, చిల్డ్రన్స్ పార్క్, రాణిగుంజ్ పార్క్ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

ఏయే రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఎలా ఉంటాయంటే..

  • ఖైరతాబాద్/పంజాగుట్ట/సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోటరీ వైపు వెళ్లాలనుకునే ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం వద్ద షాదన్-నిరంకారి వైపు మళ్లిస్తారు.
  • నిరంకారి/చింతల్‌బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహానలకు ట్రాఫిక్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌ వినియోగించడానికి ఉండదు.
  • ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్/ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు అనుమతి ఉండదు.
  • బుద్ధ భవన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట ఎక్స్‌ రోడ్డు వద్ద అనుమతించరు.
  • లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
  • రాణిగంజ్/కర్బాలా/కవాడిగూడ నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని చిల్డ్రన్స్ పార్క్ వద్ద దిగువ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
  • బీఆర్‌కెఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
    బడా గణేష్ లేన్ నుంచి ఐమాక్స్/నెక్లెస్ రోటరీ, మింట్ లేన్ నుంచి వచ్చే వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లిస్తారు.
  • ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ వైపు రోడ్డుమార్గం మూసివేస్తారు.
  • సికింద్రాబాద్ నుంచి ఎగువ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని సెయిలింగ్ క్లబ్ వద్ద దిగువ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.