AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad: సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ తర్వాత జరిగే మార్పులివే.. అచ్చంగా ఎయిర్‌పోర్ట్‌లాగే

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యంత ఆధునికరీంచనున్నారు. మరో ఏడాదిన్నరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులు పూర్తి కానున్నాయి. ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది...

Secunderabad: సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ తర్వాత జరిగే మార్పులివే.. అచ్చంగా ఎయిర్‌పోర్ట్‌లాగే
Secundrabad Railway Station
Narender Vaitla
|

Updated on: Aug 27, 2024 | 7:24 AM

Share

ప్రతీరోజూ వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సికింద్రాబాద్ స్టేషన్‌ వస్తుంటారు. అటు నార్త్‌ ఇండియాకు వెళ్లే వారితో పాటు సౌత్‌ ఇండియాకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్‌ నిత్యం కిటకిటలాడుతుంటుంది. ఇక లోకల్‌ ట్రైన్స్‌ ఎక్కేందుకు వచ్చే హైదరాబాదీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఇప్పుడు కొత్త రూపు సంతరించుకోనున్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యంత ఆధునికరీంచనున్నారు. మరో ఏడాదిన్నరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులు పూర్తి కానున్నాయి. ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది. అయితే ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌ పోర్ట్‌ తరహా వ్యవస్థను అమలు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

ఇకపై ఎవరు పడితే వారు రైల్వే ప్లాట్‌ ఫామ్స్‌పై లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. రైలు వస్తుందన్న ప్రకటన వచ్చే వరకు ప్రయాణికులు వెయిటింగ్‌ హాల్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ప్రయాణీలకు లగేజీ స్క్రీనింగ్‌ కోసం రూ. 6 కోట్ల వ్యయంతో రెండు భారీ లగేజీ స్క్రీనింగ్‌ మిషిన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెకింగ్‌ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రైలు బయలుదేరే కంటే కాస్త ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

రైలు టికెట్‌ తీసుకున్న తర్వాత ప్రయాణికులు నేరుగా వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. రైలు ప్లాట్‌ఫామ్‌ మీదికి రావడానికి 15 నిమిషాల ముందు ప్రకటన చేస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అప్పటి వరకు ప్రయాణికులు షాపింగ్‌ లేదా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎన్నో అధునాతన సదుపాయాలతో నిర్మాణం జరుపుకుంటోన్న రైల్వే స్టేషన్‌ ఎప్పుడెప్పుఉ అందుబాటులోకి వస్తుందా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..