హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపిన గజదొంగ బత్తుల ప్రభాకర్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో గన్‌ ఫైరింగ్‌ కలకలం రేపింది. మోస్ట్‌వాంటెడ్‌ గజదొంగ బత్తుల ప్రభాకర్‌ పోలీసులపై కాల్పులు జరిపాడు. ప్రిజం పబ్‌లో ఉన్న ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపిన గజదొంగ బత్తుల ప్రభాకర్‌
Shoot
Follow us
K Sammaiah

|

Updated on: Feb 02, 2025 | 11:04 AM

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో గన్‌ ఫైరింగ్‌ కలకలం రేపింది. మోస్ట్‌వాంటెడ్‌ గజదొంగ బత్తుల ప్రభాకర్‌ పోలీసులపై కాల్పులు జరిపాడు. ప్రిజం పబ్‌లో ఉన్న ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లాకి చెందిన 26ఏళ్ల ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. నార్సింగి, రాజేంద్రనగర్‌లో అనేక కేసులు ఉన్నట్టు చెప్పారు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌.

2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్‌ అయిన ప్రభాకర్‌.. 2022లో పోలీసుల నుంచి తప్పించుకుని అప్పట్నుంచి పరారీలో ఉన్నాడు. పక్కా సమాచారంతో ప్రిజం పబ్‌కి వచ్చారు పోలీసులు.. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ను ట్రాక్‌చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దాంతో, పోలీసులపైకి కాల్పులు జరిపాడు ప్రభాకర్‌.. దొంగను నిలువరించే ప్రయత్నంలో కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. కాల్పులతో పబ్‌లో ఉన్నవాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభాకర్‌ నుంచి రెండు తుపాకులు, 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
పుష్ప 2 మంత్స్ సెలబ్రేషన్స్‎.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..
పుష్ప 2 మంత్స్ సెలబ్రేషన్స్‎.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..
తండ్రి ఎమ్మెల్యే.. కూతురు హీరోయిన్.. బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్
తండ్రి ఎమ్మెల్యే.. కూతురు హీరోయిన్.. బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్
సామాజిక న్యాయం కోసం కులగణన చేయాల్సిందేః విజయ్
సామాజిక న్యాయం కోసం కులగణన చేయాల్సిందేః విజయ్