Osmania University: ఓయూలో అగ్గిరాజేసిన నిరసన.. నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ పోరాట స్ఫూర్తితో..

|

Nov 19, 2022 | 12:49 PM

ఒక ఉద్యమం మరో ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఒకరి పోరాటం మరొకరిలో స్ఫూర్తి నింపుతుంది. చరిత్రలో ఇది ఎన్నోసార్లు రుజువైంది ఇది. హైదరాబాద్‌లో ఇలాంటి పోరాటమే ఒకటి మొదలైంది. నిజాం..

Osmania University: ఓయూలో అగ్గిరాజేసిన నిరసన.. నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ పోరాట స్ఫూర్తితో..
Students Protest In Ou
Follow us on

ఒక ఉద్యమం మరో ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఒకరి పోరాటం మరొకరిలో స్ఫూర్తి నింపుతుంది. చరిత్రలో ఇది ఎన్నోసార్లు రుజువైంది ఇది. హైదరాబాద్‌లో ఇలాంటి పోరాటమే ఒకటి మొదలైంది. నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ పోరాటం ఓయూ విద్యార్ధుల్లో అగ్గి రాజేసింది. వారి పోరాట స్ఫూర్తితో హాస్టల్‌ కోసం పోరుబాట పట్టారు ఉస్మానియా వర్సిటీ విద్యార్ధులు. మెరుపు ఆందోళనతో క్యాంపస్‌లో కాక రేపారు. హాస్టల్‌ కోసం అలుపెరగని పోరాటం చేశారు నిజాం కాలేజీ యూజీ స్టూడెంట్స్‌. కొత్త బిల్డింగ్‌ను పూర్తిగా తమకే కేటాయించాలంటూ ఉద్యమించి అనుకున్నది సాధించుకున్నారు. నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ ఆందోళన విరమించిన నెక్ట్స్‌ డేనే ఓయూలో ఉద్యమం మొదలైంది. తమకూ హాస్టల్‌ కేటాయించాలంటూ విద్యార్ధులు పోరుబాట పట్టారు. హాస్టల్‌ కేటాయింపులో వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

విద్యార్ధులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం ఓయూలో టెన్షన్‌ పుట్టి్ంచింది. అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌లోకి విద్యార్ధులు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సెక్యూరిటీ సిబ్బందికి, స్టూడెంట్స్‌కు తోపులాట జరగింది. దీంతో పలువురు గాయపడ్డారు. పరిపాలనా భవనంలో వీసీ ఛాంబర్‌ను, ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి రచ్చరచ్చ చేశారు విద్యార్ధులు. వెంటనే తమకు హాస్టల్‌ను కేటాయించాలంటూ నినాదాలు చేశారు. అయితే, నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ శాంతియుతంగా పోరాడి అనుకున్నది సాధించుకుంటే, ఓయూ విద్యార్ధులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించి యూనివర్సిటీలో కలకలం రేపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..